
ఇసుక టిప్పర్ల పట్టివేత
రుద్రూర్: అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న మూడు ఇసుక టిప్పర్లను పట్టుకున్నట్లు తహసీల్దార్ గంగాధర్ తెలిపారు. రెవెన్యూ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం రాత్రి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పొతంగల్ శివారులో ఒక టిప్పర్, కోటగిరి మండలం వల్లాభాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద రెండు టిప్పర్లను పట్టుకొని కోటగిరి పీఎస్‌కు తరలించారు.
రుద్రూర్: పొతంగల్ మండలం హెగ్డోలి గ్రామ శివారులో అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఆదివారం సాయంత్రం రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. ఈ ట్రాక్టర్లను కోటగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు తహసీల్దార్ గంగాధర్ పేర్కొన్నారు.
ఇసుక డంపు స్వాధీనం
పొతంగల్ మండలం సోంపూర్ శివారులో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపును రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఇసుక 15 ట్రాక్టర్ల వరకు ఉంటుందని తహసీల్దార్ గంగాధర్ తెలిపారు. అనుమతి లేకుండా ఇసుక తరలించిన, డంపు చేసిన కేసు నమోదు చేయడంతో పాటు వాహనాలు సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు.

ఇసుక టిప్పర్ల పట్టివేత