
కొట్టుకుపోయిన తాత్కాలిక రోడ్డు
సిరికొండ: మండలంలోని గడ్కోల్ వద్ద కప్పలవాగుపై తాత్కాలికంగా వేసిన రోడ్డు వరద ప్రవాహానికి కొట్టుకు పోయింది. వాగుపై భారీ వంతెన నిర్మాణానికి ప్రభుత్వం రూ. 12 కోట్లు మంజూరు చేసింది. పనులు ప్రారంభించి ఏడాదిన్నర అవుతుండగా, పిల్లర్ల వరకు మాత్రమే పూర్తయింది. రాకపోకలకు వాగులో తాత్కాలికంగా మట్టిరోడ్డు వేశారు. శనివారం రాత్రి కురిసిన వర్షానికి వాగు ప్రవహించడంతో తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో గ్రామానికి భారీ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వాగు అవతల పంట పొలాలు ఉన్న రైతులు వంతెన వద్ద నిర్మించిన చెక్‌డ్యాం పైనుంచి రాకపోకలు సాగిస్తున్నారు.