
బోనమెత్తిన ఇందూరు
నిజామాబాద్ రూరల్/ నిజామాబాద్ సిటీ/ మోపాల్/ మాక్లూర్/ రుద్రూర్: ఇందూరులో బోనాల పండుగను ప్రజలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆషాఢమాసంలో చివరి ఆదివారం కావడంతో పల్లెల్లో, మండలాల్లో, జిల్లా కేంద్రంలో ఎటు చూసినా ప్రజలు బోనాలను ఎత్తుకొని స్థానిక అమ్మవార్లకు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. నగరంలోని కోటమైసమ్మ, చంద్రనగర్‌లో ఉన్న పుట్టమైసమ్మ ఆలయాల్లో స్థానికులు, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోటగల్లిలో ఉన్న మైసమ్మవీధిలో భక్తులు ఊరేగించిన బోనాలు, నైవేద్యాలను అమ్మవారికి సమర్పించారు. నగరంలోని సిర్నాపల్లిగడిలోని పట్టణ గాండ్ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగలో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు, నుడా చైర్మన్ కేశ వేణు పాల్గొన్నారు. బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించారు. మోపాల్ మండలం మంచిప్పలో గ్రామస్తులను బోనాల ఊరేగింపు చేపట్టారు. మాక్లూర్ మండల కేంద్రంలో గౌడ కులస్తులు బోనాల పండుగను నిర్వహించారు. రుద్రూర్ మండలం బొప్పాపూర్‌లో గ్రామస్తులను బోనాలతో ఊరేగించారు. స్థానిక గ్రామదేవలకు బోనాలను సమర్పించి పూజలు చేశారు.

బోనమెత్తిన ఇందూరు

బోనమెత్తిన ఇందూరు

బోనమెత్తిన ఇందూరు

బోనమెత్తిన ఇందూరు