
ముళ్లపొదల్లో మోడల్‌రూం..!
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద కాకతీయ కాలువ దిగువన, గోదావరి గట్టున నిర్మించిన మోడల్ రూం ముళ్లపొదల్లో మగ్గుతోంది. భవిష్యత్తు తరాలకు ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వివరించుట కోసం దీనిని నిర్మించారు. ప్రస్తుతం దీనిని పట్టించుకునే ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ మోడల్ రూంను ప్రాజెక్ట్ నిర్మాణ కాలంలోనే నాటి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు. 1983లో భారీ వరదలు వచ్చిన సమయంలో మోడ ల్ కల చెదిరి పోయింది. అప్పటి వరకు ప్రాజెక్ట్ నిర్మాణ చిత్రపటాలను మోడల్ రూంలో భద్రపరిచారు. కానీ వరదలతో కొట్టుకుపోయే పరిస్థితి ఏర్ప డటంతో వాటిని అతిథి గృహం పక్కన వేరే గదిలోకి మార్చారు. నాటి నుంచి మోడల్ రూం ముళ్ల పొదల్లోనే ఉంటోంది. కొందరు ఆకతాయిలు భవ నం పై పిచ్చి పిచ్చి బొమ్మలు వేస్తూ రాతలు రాస్తున్నారు. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతోంది. భవిష్యత్తు తరాలకు ప్రాజెక్ట్ చరిత్ర తెలియా లంటే మోడల్ రూంకు పూర్వ వైభవం తీసుకురావాలని పర్యాటకులు కోరుతున్నారు. ప్రా జెక్ట్ నిర్మాణ కాలంలోని చిత్ర పటాలను మళ్లీ మో డల్ రూంకు తరలిస్తే భవిష్యత్తు తరాలకు ప్రాజెక్ట్ గురించి కొంత మేర తెలిసే అవకాశం ఉంటుంది. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే ముళ్ల పొదలను తొలిగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌తో
పాటే నిర్మాణం
పట్టించుకోని అధికారులు
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
మోడల్ రూం పునరుద్ధరణకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ముళ్ల పొదలను వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. మోడల్ రూం పూర్వ వైభవం తీసుకురావాడానికి కృషి చేస్తాం.
– అక్తర్, ఏఈఈ, ప్రాజెక్ట్‌క్యాంప్, పోచంపాడ్