
రైల్వే సేవలు ఒకే యాప్‌లో..
మీకు తెలుసా?
ఖలీల్‌వాడి: గతంలో రైల్వేశాఖ ద్వారా అందిస్తున్న సేవల కోసం వివిధ యాప్‌లు అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు వాటిని తొలిగించి వాటి స్థానంలో రైల్ వన్ అనే యాప్‌ను రైల్వేశాఖ అందుబాటులోకి తెచ్చింది. జూలై 1 నుంచి ఈ యాప్ అమలులోకి వచ్చింది. ఈ యాప్‌లో రైలు టికెట్ రిజర్వేషన్ తోపాటు అన్ని రకాల టికెట్లను ఈ యాప్ ద్వారా పొందవచ్చు. రైళ్ల రాకపోకలకు సంబంధించిన వివరాలు, రైలు ఎక్కడున్నదనే అంశాలు స్పష్టంగా తెలుస్తుంది. రైలు సమయపాలన తోపాటు ఏ ఫ్లాట్‌ఫారంపై ఆగుతుంది, కోచ్ ఎక్కడ, పీఎన్‌ఆర్ స్థితి, రైలెక్కడ ప్రయాణిస్తుందో.. రైలు రిజర్వేషన్ రద్దు లాంటి తదితర అంశాలు అన్నీ ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. రైలులో ప్రయాణం చేసేటప్పుడు అవసరమైతే ఫుడ్‌ను ఆర్డర్ చేసుకుంటే మనం ప్రయాణిస్తున్న స్థానానికి తీసుకొచ్చి ఇస్తారు. ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్ ద్వారా, ఐవోస్ యాపిల్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మెయిల్ ఐడీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని పాస్వర్డ్ పెట్టుకోవడం ద్వారా వినియోగించుకోవచ్చు.