
‘మీ–సేవ’ల్లో అధిక డబ్బులు వసూలు చేయొద్దు
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలోని అన్ని మీ–సేవ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే నిర్వాహకుల పై చర్యలు తప్పవని ఆర్డీవో రాజేంద్రకుమార్ హెచ్చరించారు. నగరంలోని న్యూఅంబేడ్కర్ భవన్‌లో నిజామాబాద్ ఉత్తర, దక్షిణ మండలాల పరిధిలోకి వచ్చే మీసేవ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. కేంద్రాల్లో ఉన్న ధరల పట్టిక ప్రకారమే డబ్బులు తీసుకోవాలని, రేషన్‌కార్డుల జారీకి ఎవరైనా మధ్యవర్తులు ఉంటే చర్యలు తప్పవన్నారు. సమావేశంలో తహసీల్దార్లు విజయకాంత్‌రావు, బాలరాజ్, మీసేవ నిర్వాహకులు పాల్గొన్నారు.
సిబ్బందికి సమాచారం ఇవ్వాలి
సిరికొండ: విద్యుత్ సరఫరాలో ఏదైనా సమస్య తలెత్తితే రైతులు మరమ్మతులు చేయకుండా ట్రాన్స్‌కో సిబ్బందికి సమాచారం అందించాలని నిజామాబాద్ రూరల్ డీఈ అల్జాపూర్ రమేశ్ సూచించారు. మండలంలోని మైలారం గ్రామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పొలం బాట కార్యక్రమంలో డీఈ పాల్గొని మాట్లాడారు. విద్యుత్ సేవలపై అవగాహన కల్పించారు. లైన్ ఇన్‌స్పెక్టర్ బాలచంద్రం, లైన్‌మన్లు జగన్, సుభాష్, రైతులు నాగరాజు, చిన్నదా సు, విష్ణు, జనార్దన్‌రెడ్డి, ప్రసాద్ పాల్గొన్నారు.
మహరాజ్‌కు
భగవద్గీత అందజేత
సుభాష్‌నగర్: నగరంలో పర్యటిస్తున్న పూజ్య స్వామి అవదేశానంద గిరి మహరాజ్‌ను మంచాల శంకరయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ శనివారం మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఆశీర్వాదాలు పొందారు. అనంతరం మహరాజ్‌కు భగవద్గీతను అందజేశారు. నగరంలోని అమ్మ వెంచర్‌లో నిర్మిస్తు న్న వారాహి ఆలయాన్ని సందర్శించాలని మహరాజ్‌ను ఆయన కోరారు. ఆయన వెంట వైశ్య సంఘం ప్రతినిధులు లాభిశెట్టి శ్రీనివాస్, మాదాని శ్రీధర్ తదితరులు ఉన్నారు.
హైమాస్ట్ లైట్లు ప్రారంభం
సిరికొండ: మండలంలోని న్యావనంది గ్రామంలో ఎమ్మెల్సీ కవిత నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను బీఆర్‌ఎస్ నాయకులు శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ తోట రాజన్న, మాజీ సర్పంచ్ కన్క శ్రీనివాస్, తెలంగాణ జాగృతి రూరల్ కన్వీనర్ సాయిచరణ్, గ్రామ శాఖ అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, రమేశ్‌రెడ్డి, వహీద్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
నిజామాబాద్‌అర్బన్: నగరంలోని గిరిరాజ్ కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రాంమోహన్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పొలిటికల్ సైన్స్, కామర్స్, గణితం, హిస్టరి, బ్యాచ్‌లర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేటివ్, స్టాటిస్టిక్స్, ఇంగ్లిష్, బీబీఏ లాజిస్టిక్, బిజినెస్ అనాలిటిక్స్, కంప్యూటర్ సైన్స్, తెలుగు, ఫైనాన్స్, బీసీఏ టాక్సిషన్, డేటా సైన్స్, బయోటెక్నాలాజి సబ్జెక్టుల్లో బోధించేందుకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. నెట్, పీహెచ్‌డీ ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఈనెల 23 లోపు అభ్యర్థులు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
ధర్పల్లి: మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వివిధ సబ్జెక్టుల్లో బోధించేందుకు అతిథి అధ్యాపక పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ జ్యోతి శనివారం పేర్కొన్నారు. అభ్యర్థులు ఈనెల 23 లోపు కళాశాలలో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
21న సినీ సంగీత విభావరి
నిజామాబాద్ రూరల్: నగరంలోని గీతా భవనములో ఈ నెల 21న శ్రీ దాశరధి లలిత, సినీగీతాలతో సంగీత విభా వరి నిర్వహించనున్నట్లు స్వర సౌరభం అధ్యక్షుడు నాగారాజు శనివారం తెలిపారు. దాశరథి శత జయంతి పురస్కరించుకొని స్థానిక సాంసృతిక కళా సంస్థ స్వరసౌరభం, గీతాంజలి గి ల్డ్ సహకారంతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
చలో సెక్రటేరియట్‌ను
విజయవంతం చేయాలి
నిజామాబాద్‌అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని దీనికి నిరసనగా ఈ నెల 23న చేపట్టే చలో సెక్రటేరియట్ ముట్టడిని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని యూఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పెద్ది సూరి కోరారు. శనివారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యలను నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించా రు. పిప్రి శివారులోని గురుకులంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి మృతిపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు పోషమైన మహేశ్, మారుతి, వేణు, శివ, సంతోష్, బాబు, విశాల్ పాల్గొన్నారు.