
నిజామాబాద్
వాతావరణం
ఉదయం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆకాశం మేఘావృతమవుతుంది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశాలున్నాయి.
చదువులో వెనకబడిన..
చదువులో వెనుకబడిన వారిని గుర్తించి ప్ర త్యేక బోధన అందించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు.
ఆదివారం శ్రీ 20 శ్రీ జూలై శ్రీ 2025
– 8లో u
చందమామ రావే.. అంటూ చిన్నారికి గోరు ముద్దలు తినిపించాల్సిన తల్లి పని త్వరగా అయిపోవాలనే ఆతృతతో స్మార్ట్‌ఫోన్‌లో కార్టూన్‌లను చూపుతోంది. ఫలితంగా సెల్‌ఫోన్ చేతిలో లేనిదే ఆ చిన్నారి అన్నం తినలేని పరిస్థితి వస్తోంది. ఆన్‌లైన్ క్లాస్‌లు వింటారని సెల్‌ఫోన్ కొనిచ్చిన తల్లిదండ్రులు చివరకు తమ పిల్లలు వాటికి బానిసలు కావడాన్ని చూసి తలలు పట్టుకుంటున్నారు. సెల్‌ఫోన్‌ల పుణ్యమాని పిల్లలకు మాటలు రావాల్సిన వయస్సులో మాటలు రావడం లేదు.. స్కూల్‌కి వెళ్లే పిల్లలకు కనీసం వ్యాయామం అంటే తెలియడం లేదు. కూర్చున్న చోటు నుంచి గంటలపాటు కదలకుండా సెల్‌ఫోన్‌లు పట్టుకుంటున్నారు. ఈ పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
– నిజామాబాద్‌అర్బన్
ఈ–పాస్ ద్వారానే యూరియా విక్రయించాలి
డొంకేశ్వర్(ఆర్మూర్): ఈ–పాస్ యంత్రాల ద్వారానే రైతులకు యూరియా విక్రయించా లని జిల్లా వ్యవసాయాధికారి మేకల గోవింద్ అన్నారు. కృత్రిమ కొరత సృష్టించినా, ఎక్కువ ధరలకు విక్రయించినా డీలర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని పలు ఎరువుల దుకాణా లు, గోదాములను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని, అమ్మకాల్లో తే డాలు రావొద్దన్నారు. రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. రైతులు తమ అవసరం మేరకు ద ఫాల వారీగా తీసుకెళ్లాలని సూచించారు. మోతాదులోనే పంటలకు యూరియా వేయాలని లేదంటే చీడపీడలు పెరిగి దిగుబడి తగ్గే అవకాశం ఉందన్నారు. డీఏవో వెంట నిజామాబాద్ అర్బన్ ఏడీఏ వీరాస్వామి, ఎంఏవో మహేందర్‌రెడ్డి, ఏఈవో చక్రపాణి ఉన్నారు.
25, 26 తేదీల్లో
అథ్లెటిక్స్ ఎంపికలు
నిజామాబాద్‌నాగారం: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 25, 26వ తేదీల్లో నాగారంలోని రాజారాం స్టేడియంలో అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు అధ్యక్ష, కార్యదర్శులు నరాల రత్నాకర్, రాజాగౌడ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 25న అండర్– 8, 10, 12, 14, 16 బాలబాలికలకు, 26న అండర్ 18, 20, బాలబాలికలు, సీ్త్ర, పురుషుల విభాగాల్లో పోటీలు నిర్వహించి రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తామన్నారు. 40 మంది బాల బాలికలను ఆగస్టు 3, 4 తేదీల్లో జేఎన్ స్టేడియం హనుమకొండలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామన్నారు. జనగామ జిల్లాలో ఆగస్టు 7న నిర్వహించే రెండవ రాష్ట్రస్థాయి పోటీలకు 20 మంది బాల బాలికలను పంపుతామని తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 2 గంటల్లోపు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 99890 40776 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
జీరో యాక్సిడెంట్ లక్ష్యంలో భాగస్వాములు కావాలి
సుభాష్‌నగర్: జీరో యాక్సిడెంట్ లక్ష్యంలో విద్యుత్ వినియోగదారులు, రైతులు భాగస్వాములు కావాలని ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ ఆర్ రవీందర్ శనివారం ఒక ప్రకటనలో పి లుపునిచ్చారు. ప్రమాదభరితంగా, వదులు గా ఉన్న విద్యుత్ తీగలు, తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ గద్దెలు, వంగిన స్తంభా లు, రోడ్డు మీదుగా తక్కువ ఎత్తులో ఉన్న లైన్ క్రాసింగ్ వంటి ప్రమాదకరంగా ఉన్న వాటిని గమనించిన వెంటనే సెక్షన్ ఆఫీసర్ (అసిస్టెంట్ ఇంజినీర్ ఆపరేషన్), గ్రామస్థాయిలో ఉండే లైన్‌మెన్‌కు తెలియజేయాలని సూచించారు. తమ దృష్టికి వచ్చిన విద్యుత్ సమస్యలను సిబ్బంది పరిష్కరిస్తారని, త ద్వారా విద్యుత్ ప్రమాదాలను నివారించొచ్చన్నారు. పశువులు విద్యుత్ ట్రాన్స్‌ఫా ర్మర్లు, లైన్ల వద్దకు వెళ్లకుండా చూడాలని కా పర్లకు విజ్ఞప్తి చేశారు. విద్యుత్ సమస్యలు తలెత్తితే టీజీఎన్‌పీడీసీఎల్ టోల్ ఫ్రీ నంబర్ 1912ను సంప్రదించాలని ఎస్‌ఈ కోరారు.
● తొమ్మిదో తరగతి చదివే కొ డుకు స్మార్ట్ ఫోన్‌ను బాగా ఆపరేట్ చేస్తున్నాడని, ఆన్‌లైన్ చెల్లింపులను పక్కాగా చేస్తున్నా డని మురిసిపోయింది జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ ప్రాంతానికి చెందిన ఓ ప్రభుత్వ టీచర్. ఎప్పు డూ ఫోన్ పట్టుకుని కూర్చుంటున్న కొడుకు పబ్జీ గేమ్‌కి అలవాటు పడి తన బ్యాంక్ ఖాతా నుంచి రూ.60వే లు ఖర్చు చేశాడని గుర్తించి విస్తుపోయింది. ఈ విషయంలో మందలించడంతో పక్క గదిలోకి వెళ్లిన ఆ బాలుడు ఉరేసుకొనే ప్రయత్నం చే యగా ఆ తల్లి అడ్డుకుని ఆస్పత్రికి తీసుకెళ్లింది.
● బోధన్‌లోని ఓ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న బా లుడు ప్రతి రోజూ తరగతి గదిలో నిద్రపోతున్నాడు. విషయాన్ని టీచర్లు బాలుడి తల్లిదండ్రులకు తెలుపగా.. తాము నిద్రించిన తరు వాత అర్ధరాత్రి నిద్రలేస్తున్న బాలుడు 2 గంటల నుంచి తెల్లవారుజా ము 5గంటల వరకు యూ ట్యూబ్ చూస్తున్నట్లు గుర్తించారు.
● ధర్పల్లికి చెందిన ఓ మహిళ ఇటీవల జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రికి తన ఏడేళ్ల కొడుకును తీ సుకొచ్చింది. ఫోన్ లేకుండా ఒక్క క్షణం ఉండడం లేదని, యూట్యూబ్ పెడితే తప్ప అన్నం తినడంలేదని, ఫోన్ ఇవ్వకపోతే తమను ఎదిరిస్తున్నాడని వాపోయింది. ఆస్పత్రిలో ఉంచి ఒక్క రోజు ఫోన్ ఇవ్వకపోవడంతో ఆ బాలు డు వస్తువులను పగులగొట్టాడు.
● మహారాష్ట్రలోని ధర్మాబాద్‌కు చెందిన ఓ జంట తమ కూతురు మాట్లాడే భాష అర్థం కాక ఓ మానసిక వైద్యుడి వద్దకు తీసుకొచ్చింది. ఆమెను పరీక్షించి పూర్తి వివరాలు తెలుసుకున్న వైద్యుడు.. ఆ తల్లి ప్రతి రోజూ తన కూతురికి అన్నం తినిపించేందుకు ఫోన్ అలవాటు చేసిందని, ఇతర భాషల కార్టూన్ లు చూడడంతోనే ఈ పరిస్థితి అని గుర్తించాడు.
ప్రపంచాన్ని అర చేతిలో చూయించే సెల్‌ఫోన్ అన్ని వయస్సుల వారిపై చూపుతున్న ప్రభావం అంతాఇంతా కాదు. అందివచ్చిన టెక్నాలజీని అవకాశంగా మల్చుకుంటున్న కొంత మంది వి ద్యార్థులు, యు వత బంగారు బాట వేసుకుంటుండగా.. మరెంతో మంది తమ భవిష్యత్‌ను చేజేతులారా అంధకారంలోకి నెట్టేసుకుంటున్నారు. స్మార్ట్‌ఫోన్‌కు అలవాటు పడిన విద్యార్థుల మానసిక స్థితిలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సెల్‌ఫోన్ వాడకం తీవ్ర ప్రభావం చూపుతోందని మానసిక వైద్యనిపుణులు అంటున్నారు.
చదువుపై ధ్యాస తక్కువ..
ఫోన్ ఎక్కువగా అలవాటు పడిన వారిలో చదువులపై ధ్యాస తగ్గిపోతోంది. చరవాణి వ్యసనంగా మారితే పిల్లలు ఒంటరిగా ఉండడానికి మాత్రమే ఇష్టపడతారు. ఇంట్లో అందరూ ఉంటే పడకగదిలో తలుపులు వేసుకొని మరి ఫోన్‌కి పరిమితం అవుతారు. సోషల్ మీడియా వినియోగంతో చెడు వ్యసనాలకు అలవాటు పడే ప్రమాదం ఉంది.
ఎప్పుడు చూసినా..
పిల్లలకు అసలు వ్యాయామం అంటే ఏమిటో తెలియని పరిస్థితి ఉంది. ఉదయం లేచింది మొదలు స్కూల్ సమయం వరకు, స్కూల్ నుంచి వ చ్చీరాగానే పడుకునే వరకు చేతుల్లో సెల్‌ఫోన్ ఉండడంతో పిల్లలకు అస లు బయటి ప్రపంచం తెలియకుండాపోతోంది. ఫోన్‌ల కారణంగా ఆటలాడేందుకు ఇష్టపడడం లేదు.
దుష్ప్రభావాలు అనేకం..
బద్ధకం, మతిమరుపు, మొండితనం
ప్రతి చిన్న విషయానికి కోపగించుకోవడం, గొడవపడడం
ఇంట్లోని పెద్దలను ఎదురించడం
స్నేహితులు లేకపోవడం, బంధుత్వాలు తెలియకపోవడం
నేర ఘటనలను చూడడం కారణంగా నేరప్రవృత్తి వైపు వెళ్లే ప్రమాదం
మానసిక ఒత్తిడి పెరిగి అఘాయిత్యాలకు పాల్పడే అవకాశం
న్యూస్‌రీల్
సైకియాట్రిస్ట్‌ల వద్ద పెరుగుతున్న కేసులు.. నెలకు వంద వరకు
మానసిక స్థితిని ప్రభావితం చేస్తున్న సెల్‌ఫోన్
గ్రౌండ్ తెలీదు.. క్రీడలపై ఆస్తకి లేదు శారీరక వ్యాయామమూ లేదు
ఆన్‌లైన్ క్లాసుల పేరిట..
పెరుగుతున్న కేసులు..
సెల్‌ఫోన్‌లకు బానిసలుగా మారిన పిల్లల కేసులు మానసిక వైద్యుల వద్దకు నెలకు సుమారు వంద వరకు వస్తున్నాయని ప్రముఖ మానసిక వైద్యనిపుణుడు విశాల్ తెలిపారు. జిల్లా కేంద్రంతోపాటు వివిధ ప్రాంతాల్లో సుమారు 10 మంది మానసిక వైద్యులు ఉ న్నారని, ఒక్కొకరికి వద్దకు నెలలో పది వరకు కేసులు వస్తున్నాయంటున్నారు. ఇదిలా ఉండగా కొందరు అవగాహన లేకపోవడంతో వైద్యుల వద్దకు రావడం లేదని పేర్కొన్నారు. చిన్న పిల్లలో రోజురోజుకూ మానసిక సమ స్యలు పెరుగుతున్నాయని, సెల్‌ఫోన్ లేనిదే ఉండలేకపోతున్నారని అంటున్నారు.
నరాల వ్యవస్థపై తీవ్ర ప్రభావం
చిన్న పిల్లలౖపై ఫోన్ ప్రభా వం తీవ్ర దుష్పరిణామాలకు దారితీస్తుంది. ముఖ్యంగా పిల్లలు ఎదిగే సమయంలో నరాలపై ఒత్తిడి పడుతుంది. నిద్ర సమస్యలు వస్తాయి. అదే పనిగా ఫోన్ చూస్తుంటే నరాలు దెబ్బతింటాయి. మానసిక ఎదుగుదల ఉండదు. ఫోన్‌కు దూరంగా ఉండడమే ఉత్తమం. ప్రస్తుతం సెల్ ఫోన్ కారణంగా తలెత్తుతున్న అనర్థాలకు సంబంధించిన కేసులు పెరుగుతున్నాయి.
– సాయిశ్రీపాదరావు, న్యూరో ఫిజీషియన్
సెల్‌ఫోన్ ఆట వస్తువు కాదు
సెల్‌ఫోన్ ఆట వస్తువు కాదని తల్లిదండ్రులు గుర్తించాలి. స్మార్ట్ ఫోన్ వాడకం క్రమంగా పిల్లల్లో వ్యసనంగా మా రుతోంది. ఫలితంగా పిల్లల వ్యవహార శైలిపై తీవ్ర ప్రభా వం చూపుతోంది. చాలామందిలో చురుకుదనం తగ్గి సోమరితనం పెరుగుతోంది. రాత్రి 9 గంటలలోపు నిద్ర పోవాల్సిన పిల్లలు అర్ధరాత్రి వరకు ఫోన్‌లు వాడుతున్నారు. ఇది ఆందోళనకర విషయం. పిల్లలను సెల్‌ఫోన్‌లకు దూరంగా ఉంచాలి.
– విశాల్, మానసిక వైద్య నిపుణలు
ఆన్‌లైన్ క్లాస్‌లు, ప్రాజెక్ట్ వర్క్‌ల కోసమని స్కూల్‌కి వెళ్లే 8 నుంచి 15 ఏళ్ల పిల్లలకు తల్లిదండ్రులు సెల్‌ఫోన్‌లు, ట్యాబ్‌లు కొనిస్తున్నారు. ఇంటర్నెట్ కోసం డాటా ప్యాకేజీ రీచార్జి చేయడం లేదంటే ఇంట్లోనే వైఫై పెట్టిస్తున్నారు. ఇక్కడే చాలా మంది పిల్లలు పక్క దారి పడుతున్నారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసే, వ్యాపారాల్లో బిజీగా ఉండే వారి ఇళ్లలో పర్యవేక్షణ, నియంత్రణ లేకపోవడంతో సుమారు 60 నుంచి 80 శాతం పిల్లలు సెల్‌ఫోన్‌లకు బానిసలవుతున్నారు. వీరి వద్ద అత్యంత ఖరీదైన సెల్‌ఫోన్‌లు, ట్యాబ్‌లు ఉంటున్నాయి. 12 ఏళ్లలోపు పిల్లలు 20 శాతం మందికి ఫేస్‌బుక్ ఖాతా ఉంటోంది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ వినియోగం ఎక్కువగా పెరిగింది. పిల్లలు ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వాట్సాప్‌నూ వినియోగిస్తున్నారు. సో షల్ మీడియా ప్రభావం పెరగడంతో 15 ఏళ్ల వ యస్సున్న పిల్లలు ప్రేమలో పడుతున్నారు. 18 ఏళ్ల వయస్సు వచ్చే సరికి పరిస్థితి చేయిదాటుతోంది.

నిజామాబాద్

నిజామాబాద్

నిజామాబాద్

నిజామాబాద్

నిజామాబాద్