
టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించాలి
ఖలీల్‌వాడి: ప్రతి కేసులో సంబంధిత వ్యక్తులకు సమయానుగుణంగా ఈ–సమన్లు జారీ చేయాలని, పారదర్శకత, వేగవంతమైన సేవలకు టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించాలని సీపీ సాయిచైతన్య అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయం కమాండ్ కంట్రోల్ హాల్‌లో కోర్ట్ డ్యూటీ ఆఫీసర్లకు ఈ–సమన్లపై శిక్షణ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఈ–సమన్ల జారీకి సంబంధిత డిజిటల్ ప్లాట్ ఫామ్‌ను వాడడంలో శిక్షణ తీసుకొని, ప్రతి ఆదేశాన్ని రికార్డు చేయాలని సూచించారు. కోర్టుల నుంచి జారీ అయ్యే సమన్లను త్వరితగతిన సర్వ్ చేయాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ శ్యాం కుమార్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని కోర్టు డ్యూటీ ఆఫీసర్లు, ఐటీ కోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.
సీపీ సాయి చైతన్య
కోర్టు డ్యూటీ ఆఫీసర్లకు
ఈ–సమన్లపై శిక్షణ