
కార్మిక శాఖ విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా మాణిక్ రాజు
నిజామాబాద్ లీగల్: నిజామాబాద్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, సీనియర్ న్యాయవాది బీ మాణిక్‌రాజును జిల్లా కార్మిక శాఖ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యునిగా నియమిస్తూ కలెక్టర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా న్యాయసేవాధికార సంస్థ తరపున న్యాయవాది మాణిక్‌రాజును సభ్యునిగా నియమించారు. భవన నిర్మాణ కార్మిక సంఘాలతో కలిసి సంక్షేమ పథకాలు కార్మికులకు చేరేలా మాణిక్ రాజు కృషి చేశారు. కార్మిక చట్టాలు వాటి ప్రయోజనాలపై న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించారు. పదుల సంఖ్యలో కార్మికులకు తన సొంత డబ్బుతో బీమా సౌకర్యం కల్పించారు. విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా నియామకమైన మాణిక్ రాజును న్యాయవాదులు అభినందించారు.