
గుర్తు తెలియని వాహనం ఢీ.. యువకుడి మృతి
కమ్మర్‌పల్లి: కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని శుక్రవారం దేవీ ఆలయం సమీపంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. హసకొత్తూర్ గ్రామానికి చెందిన ఇరగదిండ్ల శంకర్(27) ద్విచక్ర వాహనంపై కమ్మర్‌పల్లికి వెళ్తున్నాడు. మార్గమధ్యలో శుక్రవారం దేవీ ఆలయం సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు నిజామాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్‌రెడ్డి తెలిపారు.