
రోడ్ల మరమ్మతులు చేయించాలి
● పీసీసీ చీఫ్‌ను కలిసిన నాయకులు
నిజామాబాద్ సిటీ: జిల్లా కేంద్రంలో అంతర్గత కొత్త రోడ్లతోపాటు పాడైపోయిన రోడ్లకు మరమ్మతులు చేయించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా కేంద్రంలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. మాజీ ఎంపీ అజారుద్దీన్, కాంగ్రెస్ నాయకులు బాడ్సి శేఖర్‌గౌడ్, డీ రాజేంద్రప్రసాద్, బట్టు బలరాం, శివప్రసాద్, రాజేశ్ ఉన్నారు.