
వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేక బోధన అందించాలి
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): ఆయా సబ్జెక్టులలో చదువులో వెనకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక బోధన అందిస్తూ మెరుగైన ఫలితాలు వచ్చే లా ఉపాధ్యాయులు అంకితభావంతో కృషి చే యాలని కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. శనివారం డిచ్‌పల్లి మండలం ధర్మారం(బి) గ్రామంలోని మహాత్మా జ్యోతీబా పూలే బీసీ బాలుర గురుకుల పాఠశాల/కళాశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్, డార్మెటరీలను పరిశీలించారు. స్టోర్ రూమ్‌లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశా రు. డైట్ చార్జీలను పెంచుతూ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన కొత్త మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని వివరాలు తెలుసుకున్నారు. ఆహార పదార్థాలను భద్రపరిచే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం తయారు చేయాలని నిర్వాహకుల కు సూచించారు. మెనూ ప్రకారం ప్రతిరోజూ ఉడకబెట్టిన కోడిగుడ్లు అందిస్తున్నారా, టెండర్ ప్రక్రియ పూర్తయిందా అని ఆరా తీశారు. భోజనం తయారు చేసేందుకు వినియోగించే ఆహార పదార్థాలు, సరుకులు, కూరగాయలు కలుషితం కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నాసిరకమై న ఆహార పదార్థాలు, కూరగాయలు సరఫరా చేసిన సమయంలో అధికారులకు సమాచారం అందించాలన్నారు. నిర్లక్ష్యానికి తావివ్వకుండా, మెనూ ప్రకా రం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. అంతకుముందు ఆఫీస్ రూంలో పాఠశా ల, కళాశాల ప్రిన్సిపాల్స్ ఎన్ దివ్యరాణి, ఎన్ లక్ష్మీల తో సమావేశమై, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పర్యవేక్షణ అధికారి ఎ ల్లవేళలా అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. పాఠశాల నిర్వహణను పక్కాగా పర్యవేక్షించాలని, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. సిబ్బంది అటెండెన్స్, ఇతర రికార్డులను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థుల రోజువారీ దినచర్య గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ ఆర్‌సీవో సత్యనాథ్ రెడ్డి, డిచ్‌పల్లి తహసీల్దార్ సతీష్ రెడ్డి తదితరులున్నారు.
పరిశుభ్రమైన వాతావరణంలో
భోజనం తయారు చేయాలి
జ్యోతీబాపూలే పాఠశాల/కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్