
వర్సిటీ సమస్యలు పరిష్కరించాలి
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళికి వర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులు విన్నవించారు. శనివారం తె యూను సందర్శించిన విద్యా కమిషన్ చైర్మన్ మురళి, సభ్యులు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావును వేర్వేరుగా కలిసిన ఎన్‌ఎస్‌యూఐ, పీడీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ సంఘాల నాయకులు సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. వర్సిటీలో ఇంజినీరింగ్ కళాశాల, ఐ దు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ లా కోర్సు, ఫార్మసీ క ళాశాల ఏర్పాటు, ఆడిటోరియం, నూతన బాలికల హాస్టల్ నిర్మాణం, బోధ న, బోధనేతర పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బానోత్ సాగర్‌నాయక్, పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు రాజ్‌కుమార్, పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్‌కు
విద్యార్థి సంఘాల వినతి