
‘జెడ్పీ’పై బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయం
సుభాష్‌నగర్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని, జెడ్పీపై బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమని పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని అన్ని సర్వేలు చెప్పాయని తెలిపారు. స్థానిక సమస్యలను గుర్తిస్తూ మండలస్థాయిలో పాదయాత్రలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. జూలై 29, 30 తేదీల్లో మహా సంపర్క్ అభియాన్, ఆగస్ట్ 1, 2, 3 తేదీల్లో మండలాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి బైక్ ర్యాలీ చేపట్టాలని, అనంతరం మండల అధికారులకు వినతిపత్రం సమర్పించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ, పసుపు బోర్డు జాతీయ చైర్మన్ పల్లె గంగారెడ్డి, జిల్లా ప్రభారి కాంతారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాశ్‌రెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి, బస్వా లక్ష్మీనర్సయ్య, పెద్దోళ్ల గంగారెడ్డి, వడ్డే మోహన్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, స్రవంతి రెడ్డి, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.