
అభివృద్ధిపై చర్చకు ఎప్పుడైనా సిద్ధమే
నిజామాబాద్ సిటీ: అభివృద్ధిపై చర్చించడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి అన్నారు. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి తనపై నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేయడం తగదని సూచించారు. ఇటీవల జరిగిన వేల్పూరు ఘటనపై శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రశాంత్‌రెడ్డి స్వగ్రామమైన వేల్పూర్‌లో గురువారం జరిగిన ఘటనలకు ప్రశాంత్‌రెడ్డే బాధ్యత వహించాలన్నారు. గల్ఫ్ బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ప్రశాంత్‌రెడ్డి, హరీష్‌రావు, కేటీఆర్‌లు అసత్యాలు మాట్లాడుతున్నారన్నారు. ఈ విషయం చర్చించేందుకు ప్రశాంత్‌రెడ్డికి కనువిప్పు కలిగిద్దామనుకుంటే ఆయన రాకుండా హైదరాబాద్‌లో దాక్కున్నాడని విమర్శించారు. దాడులు చేసే సంస్కృతి కాంగ్రెస్‌కు లేదన్నారు. మంత్రిగా ఉన్న సమయంలో ఆయనన ప్రశ్నించినవారిపై ప్రశాంత్‌రెడ్డి అక్రమ కేసులు బనాయించారని గుర్తుచేశారు. నంగి దేవేందర్ రెడ్డిపై దాడికి పరోక్షంగా పురిగొల్పింది ప్రశాంత్‌రెడ్డే అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తే మాత్రం చేతులు ముడుచుకొని కూర్చోను అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై గాని, తనపైగాని నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ప్రశాంత్‌రెడ్డీ..! నాపై తప్పుడు
ఆరోపణలు మానుకో
డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార
సంఘాల చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి