
ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపిన మాజీ మంత్రి
వేల్పూర్: ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో అలజడులు సృష్టించి లబ్ధి పొందా లనే దురాశతో మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపారని రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ సుంకెట అన్వేష్‌రెడ్డి ఆరోపించా రు. గురువారం ఆయన హైదరాబాద్ నుంచి మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిపై ప్రశాంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ నంబి దేవేందర్‌రెడ్డి, మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఇంటికి వెళ్లారన్నారు. కానీ, ప్రశాంత్‌రెడ్డి అనుచరులు రౌడీల్లా ఆయనపై దాడికి తెగబడడం అత్యంత దారుణమన్నారు. గల్ఫ్ బాధితులను ప్రభుత్వం ఎలా ఆదుకుంటుందో వివరించే కార్యక్రమాన్ని తాము తీసుకుంటే, ముందస్తుగానే రౌడీలను ఇంట్లో పెట్టుకొని దేవేందర్‌రెడ్డిపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇలాంటి చర్యలను ప్రజలు ఏమాత్రం హర్షించరని పేర్కొన్నారు.
రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్‌రెడ్డి