
మరిన్ని పరిశోధనలకు ఆదర్శంగా తీసుకోవాలి
రాకేశ్ శర్మ తరువాత రెండో భారత జాతీయుడు అంతరిక్షంలో పరిశోధన కోసం వెళ్లడం గొప్ప విషయం. శుభాంశు శుక్లా పరిశోధన యాత్రను ఆదర్శంగా తీసుకుని యువత, విద్యార్థులు మరిన్ని పరిశోధనలు చేయడమే ల క్ష్యంగా దూసుకెళ్లాలి. ము ఖ్యంగా భారతీయ యు వత అన్నిరంగాల్లో తమ సత్తా నిరూపించుకుంటు న్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ మొదలు దాదాపు 25 మల్టీ నేషనల్ కంపెనీల కు సీఈవోలుగా భారతీయులు సత్తా చాటుతున్నా రు. పలువురు టెక్నోక్రాట్లు నాసాలో అనేక పరిశోధనలు చేస్తున్నారు. చాలా పశ్చిమ దేశాల్లో భార తీయ వైద్యులు తిరుగులేని సర్జన్లుగా, వైద్య నిపుణులుగా సేవలందిస్తున్నారు. అనేక ఆవిష్కరణలు చేస్తున్నారు. – కాటిపల్లి మహేందర్‌రెడ్డి,
హైకోర్టు న్యాయవాది