
విద్యార్థులు స్ఫూర్తి పొందాలి
శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర విజయవంతం కావడంపై ప్రతి భారతీయుడు గర్వపడాలి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వివిధ పరిశోధనలు చేసి విజయవంతంగా తిరిగిరావడం సంతోషకరం. వి ద్యార్థులు శుభాంశు శుక్లాను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలి. కలలు కనండి, వాటిని నిజం చేసుకోండి అని మాజీ రాష్ట్రపతి ఏపీ జే అబ్దుల్ కలాం చెప్పిన సూక్తిని పరిగణనలోకి తీసుకుని విద్యార్థులు స్ఫూర్తి పొందాలి. ఆకాశమే హద్దుగా మానవాళికి ఉపయోగపడేవిధంగా పరిశోధనలు చేసే లక్ష్యంతో విజ్ఞానాన్ని సముపార్జించుకుంటూ గొప్పగా ఎదగాలి.
– టి వినయ్ కృష్ణారెడ్డి, కలెక్టర్