
సమన్వయంతో అభివృద్ధి సాధిద్దాం
● కామారెడ్డి జిల్లా సమీక్ష సమావేశంలో
ఇన్‌చార్జి మంత్రి సీతక్క
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క సూచించారు. మంగళవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధ్యక్షతన కలెక్టరేట్ స మావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం ని ర్వహించారు. ఎంపీ సురేశ్ షెట్కార్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌అలీ, పోచారం శ్రీనివాస్‌రె డ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రెటరీ అనితా రా మచంద్రన్, ఎమ్మెల్యేలు మదన్‌మోహన్‌రావు, లక్ష్మీకాంతారావు తదితరులు పాల్గొన్నారు. పలు శాఖ లపై మంత్రి సీతక్క సమీక్షించారు. వివిధ శాఖల అధికారుల పనితీరుపై ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అధికారులు మనసుపెట్టి పనిచేయాలన్నారు. సమ స్యలను పరిష్కరిస్తూ ప్రజల్లో మంచి పేరు తె చ్చుకోవాలని, మీరు మంచి చేస్తే ప్రభుత్వానికి మంచి పేరొస్తుందని పేర్కొన్నారు. సమస్య ఉందని తెలియగానే దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయాలన్నారు. ఒకవేళ సమస్య తీవ్రమైనదైతే ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రుల దృష్టికి తీసుకురావడం ద్వారా అది జఠిలం కాకుండా చూడవచ్చన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేయాలని సూచించారు. తాగునీరు కలుషితం కాకుండా చూడాలన్నారు. డెంగీ ప్రబలకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన మందులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
ఇందిరమ్మ ఇళ్లు..
లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లను వేగంగా నిర్మించుకునేలా అధికారులు చూడాలని మంత్రి సూ చించారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారికి సెర్ప్, డ్వాక్రాల ద్వారా రుణాలు ఇప్పించి సహకరించాలన్నారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా మంజూరైన రోడ్ల నిర్మాణాలకు వెంటనే టెండర్లు పిలిచి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మహి ళా శక్తి భవనాలను నవంబర్ 19న ప్రారంభించేందుకు సిద్ధం చేయాలన్నారు. అద్దె భవనాల్లో నడుస్తున్న అంగన్‌వాడీ భవనాల లెక్కలు తీయాలని, వాటికి సొంత భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. అంగన్‌వాడీ టీ చర్లు, ఆయాల పోస్టులను భర్తీ చేయడానికి రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్న ట్టు తెలిపారు. ఎస్పీ రాజేశ్ చంద్ర, జిల్లా అటవీ అ ధికారి నిఖిత, సబ్ కలెక్టర్ కిరణ్మయి, అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్, ఏఎస్పీ చైతన్య పాల్గొన్నారు.