
జిల్లా వ్యవసాయ అధికారిగా గోవింద్
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లా వ్యవసాయాధికారిగా మేకల గో వింద్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆయ న జిల్లా కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. గోవింద్ గతంలో జిల్లాలో డీఏవోగా పని చేసి రాష్ట్ర శాఖకు బదిలీ అయ్యారు. ప్ర స్తుతం రిటైర్మెంట్‌కు దగ్గర్లో ఉండగా, ప్రభు త్వం మళ్లీ జిల్లాకు డీఏవోగా పోస్టింగ్ ఇచ్చింది ప్రభుత్వం. అయితే మొన్నటి వరకు ఇన్‌చార్జి డీఏవోగా పని చేసిన వీరాస్వామి నిజామాబాద్ అర్బన్ ఏడీఏగా రెగ్యులర్ పోస్టులో పని చేయనున్నారు.
లింబాద్రిగుట్టపై టూరిజం గెస్ట్‌హౌస్‌కు రూ.40లక్షలు
మోర్తాడ్: భీమ్‌గల్ మండలంలోని లింబాద్రి గుట్ట (లక్ష్మీ నర్సింహ స్వామి ఆలయం) వద్ద పర్యాటకుల అతిథి గృహం నిర్మాణం కోసం రూ.40 లక్షలు మంజూరు చేస్తూ రాష్ట్ర పర్యా టక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. భక్తులు, అతిథుల సౌకర్యార్థం గెస్ట్‌హౌస్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి ముత్యాల సునీత్‌రెడ్డి మంత్రికి విన్నవించగా ఆయన నిధులు మంజూరు చేశారని నాయకులు తెలిపారు. నిధులు మంజూరి చేసిన మంత్రికి, అందుకు కృషి చేసిన నాయకులకు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.
సిద్ధులగుట్టపై కాటేజీల నిర్మాణానికి..
ఆర్మూర్‌టౌన్: పట్టణంలోని నవనాథ సిద్ధు ల గుట్టపై కాటేజీల నిర్మాణానికి రూ.50 ల క్షలు మంజూరైనట్లు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి పొద్దుటూరి వినయ్‌రెడ్డి తెలిపారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆలయాన్ని సందర్శించిన సమయంలో నిధులు మంజూరు చేయాలని విన్నవించామన్నారు. మంత్రికి వినయ్‌రెడ్డితోపాటు ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఎఫ్‌పీవోల సంఖ్య
పెంచేందుకు చర్యలు
సుభాష్‌నగర్: రాష్ట్రంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్‌పీవో)ల సంఖ్యను పెంచి ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మంగళవారం రైతు ఉత్పత్తిదారుల సంస్థల పెంపునకు సంబంధించి అవగాహనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు రాష్ట్రంలో ఎఫ్‌పీవోలుగా ఎంపికై న 311 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు నిర్వహణ వ్యయాల మొదటి విడత చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. 311 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా రూపాంతరం చెందాయన్నారు. అందులోభాగంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 34 ( నిజామాబాద్ 12, కామారెడ్డి 22) పీఏసీఎస్‌లు ఎఫ్‌పీఓలుగా ఉన్నాయని తెలిపారు. తద్వా రా రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడి సా మూహిక అభివృద్ధి చెందుతారన్నారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్లు, జిల్లా సహకార అధికారులు, రైతులు పాల్గొన్నారు.