
ఎస్సారెస్పీలోకి నిలిచిన ఇన్‌ఫ్లో
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద (ఇన్‌ఫ్లో) నిలిచి పోయింది. ప్ర స్తుత సీజన్‌లో మేలోనే ఎగువ ప్రాంతాల నుంచి వ రద వచ్చి ప్రాజెక్ట్ నీటి మట్టం క్రమంగా పెరిగింది. దీంతో సకాలంలో ప్రాజెక్టు నిండుతుందని రైతులు ఆశించగా, ప్రస్తుతం ఇన్‌ఫ్లో నిలిచిపోవడంతో రైతు లు ఆందోళనకు గురవుతున్నారు. ఆయకట్టు రైతు లు వర్షాల ఆధారంగా నారు మడులను సిద్ధం చేసుకున్నారు. సకాలంలో వరదలు వస్తే ప్రాజెక్ట్‌నుంచి కాలువల ద్వారా ఆయకట్టుకు నీరు విడుదలవుతుందని ఆశించారు. కానీ ప్రస్తుత పరిస్థితి వారి ఆశలకు విరుద్ధంగా ఉంది.
ఎగువన ఖాళీనే..
ఎస్సారెస్పీలోకి ప్రధానంగా వరద వచ్చే మహారాష్ట్ర ప్రాంతంలోని గైక్వాడ్, విష్ణుపురి ప్రాజెక్టులు కూడా ఖాళీగా ఉన్నాయని ప్రాజెక్టు అధికారులు తెలుపుతున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం వర్షపాతం లేదని, ఇప్పటికిప్పుడు వరదలు వచ్చే అవకాశం లేదని ప్రాజెక్ట్ అధికారులు అంటున్నారు. 2018 నుంచి ప్రాజెక్ట్‌లోకి ప్రతి ఏడాది జూలై చివరి నాటికి వరద నీరు చేరగా, ఈ ఏడాది ఆ పరిస్థితి కనిపించడం లేదు.
నిలకడగా నీటి మట్టం
ప్రాజెక్ట్ నీటి మట్టం ప్రస్తుతం నిలకడగా ఉంది. కాకతీయ కాలువ ద్వారా 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా ఆవిరి రూపంలో 367 క్యూసెక్కుల నీరు పోతోంది. మిషన్ భగీరథ అవసరాలకు 231 క్యూసెక్కులు వినియోగిస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థా యి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగు లు కాగా మంగళవారం సాయంత్రానికి 1068.50 (21 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది.
సీజన్‌లో వరద రాకపోవడంతో
రైతుల్లో ఆందోళన
నిజాంసాగర్ నీటి విడుదల
నిజాంసాగర్: ఆయకట్టు కింద సాగువుతున్న పంటల కోసం మంగళవారం నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటి విడుదలను ప్రారంభించారు. ప్రధాన కాలువ కింద 1.4 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. మొదటి ఆయకట్టు ప్రాంతంలో వరినాట్లు వేస్తున్నారు. ఆయకట్టు పంటల కోసం ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు వెయ్యి క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నామని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.