
నకిలీ ఏజెంట్లను నమ్మొద్దు
● ఇల్లు అద్దెకు ఇచ్చే ముందు పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలి
● సీపీ సాయి చైతన్య
ఖలీల్‌వాడి: ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మాయమాటలు చెప్పి మోసం చేసే నకిలీ గల్ఫ్ ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని సీపీ పోతరాజు సాయిచైతన్య మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. నిరుద్యోగుల నుంచి పాస్‌పోర్టు, వీసా, రవాణా, టూరిస్ట్ తదితర సేవలు కల్పిస్తామని చెప్పి చాలా మంది గల్ఫ్ ఏజెంట్లు అనధికార వ్యాపారాలు నిర్వహిస్తూ, అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. గల్ఫ్ ఏజెంట్లకు ఇల్లు అద్దెకు ఇచ్చే ముందు జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రజలకు సీపీ సూచించారు. ఒక ఇల్లు అద్దెకు ఇవ్వాల్సి వస్తే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందించాలని పేర్కొన్నారు. అలాగే ఈనెల 16 నుంచి 31వ తేదీ వరకు పలు నిబంధనలను కమిషనరేట్‌పరిధిలో అమలులో ఉంటాయని ప్రకటనలో వివరించారు.
ప్రజలకు ఇబ్బందులు కలిగేలా విగ్రహాలను ప్రతిష్టించొద్దని, విగ్రహాల ఏర్పాటుకు కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ అనుమతులు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. రెసిడెన్షియల్, కమర్షియల్ స్థలాల్లో రాత్రి సమయంలో 55 డెసిబుల్స్ సౌండ్ వాడాలని రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు డీజేల సౌండ్ సిస్టంను నిషేధించినట్లు పేర్కొన్నారు. సభలు, సమావేశాలకు ఏసీపీ అనుమతి తప్పనిసరి అని, 500 కన్నా ఎక్కువ మందితో నిర్వహించే కార్యక్రమానికి 72 గంటల ముందు సీపీ అనుమతి తీసుకోవాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తప్పవని, డ్రోన్‌ల వినియోగానికి పోలీసు, ఏవియేషన్ తదితరశాఖల అధికారుల క్లియరెన్స్ తప్పనిసరి అని స్పష్టం చేశారు.