
ఆర్‌ఎంపీ ఆత్మహత్య
నిజాంసాగర్(జుక్కల్): జుక్కల్ మండలం మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన మోరె గణేశ్(38) అనే ఆర్‌ఎంపీ ఆదివారం ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై నవీన్ చంద్ర తెలిపారు. భార్యాభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్థలలో మానసిక వేదనకు గురైన గణేశ్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
అప్పల బాధతో ఒకరు..
రుద్రూర్: కోటగిరి మండలం వల్లభాపూర్ గ్రామానికి చెందిన మేకల హన్మాండ్లు (30) చికిత్స పొందుతూ జిల్లా ఆస్పత్రిలో మృతి చెందినట్లు ఎస్సై సునీల్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కూలి పనులు చేస్తూ జీవించే హన్మాండ్లు అప్పులు పెరిగి పోవడంతో ఈ నెల 13న సాయంత్రం గుర్తు తెలియని పురుగుల మందు తాగాడు. గుర్తించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం నిజామాబాద్‌లోని జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడి భార్య గంగామణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
ఆర్మూర్‌టౌన్: పట్టణంలోని కెనాల్ కట్ట సమీపంలో సోమవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన ట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉంటుందని, దేహంపై తెల్లటి రంగు టీషర్టు, కాకి కలర్ ప్యాంట్ ఉందన్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంచామని, వ్యక్తి గురించి ఎవరికై నా సమాచారం తెలిస్తే పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని తెలిపారు.
స్నూకర్ షాపుపై పోలీసుల దాడి
ఖలీల్‌వాడి: నగరంలోని ఒకటో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో స్నూకర్ షాపుపై ఆదివారం అర్ధరాత్రి సీసీఎస్ పోలీసులు దాడి చేశారు. ఈ షాపు లో గత కొన్ని రోజుల నుంచి బెట్టింగ్ దందా సాగిస్తున్నారనే ప్రచారం జరుగుతున్నట్లు సమాచారం రావడంతో సీసీఎస్ పోలీసులు దాడులు చేశారు. నలుగురిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ. 2,500 స్వాధీనం చేసుకొని ఒకటో టౌన్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు.
డ్రంకెన్ డ్రైవ్‌లో ఒకరికి జైలు
బాల్కొండ: మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన మెండోరా మండల కేంద్రానికి చెందిన వేముల సాయిలుకు ఆర్మూర్ కోర్టు మెజిస్ట్రేట్ గట్టు గంగాధర్ సోమవారం రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు బాల్కొండ ఎస్సై శైలెందర్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.