
పాఠశాలలో ఫర్నిచర్ ధ్వంసం
రుద్రూర్: పోతంగల్ మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం స్కూల్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాల గది తాళాలు పగులగొట్టి సీలింగ్ ఫ్యాన్లు, వాటర్ బోర్ కేబుల్స్, ట్యూబ్ లైట్లు ధ్వంసం చేశారని హెడ్‌మాస్టర్ సాయికుమార్ తెలిపారు. సోమవారం ఉదయం పాఠశాలలోకి రాగానే చిందరవందరగా పడి ఉన్న వైర్లను చూసి అవాక్కయ్యారు. వాటర్ బోర్ కేబుల్స్, ట్యూబ్ లైట్లు, స్వీచ్ బోర్డులు, సర్వీస్ వైర్ ధ్వంసమైనట్లు గుర్తించారు.
అక్రమ ఇసుక నిల్వల సీజ్
రెంజల్(బోధన్): మండలంలోని కందకుర్తి పరిధిలోని మొఘల్‌పుర శివారులో గోదావరి ఒడ్డుపై అక్రమంగా నిల్వ చేసిన ఇసుక నిల్వలను సోమవారం రెవెన్యూ అధికారులు, పోలీసులు సీజ్ చేశారు. మొఘల్‌పుర శివారు లో సుమారు 300 ట్రాక్టర్ల ఇసుక నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. సీజ్ చేసిన ఇసుక నిల్వలను ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా అందజేస్తామని తహశీల్దార్ శ్రావణ్‌కుమార్ తెలిపారు. ఆయన వెంట బోధన్ రూరల్ సీఐ విజయ్‌బాబు, రెంజల్ ఎస్సై చంద్రమోహన్ ఉన్నారు.

పాఠశాలలో ఫర్నిచర్ ధ్వంసం