
ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు
పెర్కిట్/బోధన్ టౌన్ : మహిళలు, విద్యార్థినులపై ఎవరైనా ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని షీ టీం సభ్యులు విఘ్నేష్, సుమతి తెలిపారు. ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సోమవారం షీ టీం ఆధ్వర్యంలో నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా షీ టీం సభ్యులు మాట్లాడుతూ పోకిరీల వేధింపులకు గురైన వారు షీ టీవ్‌ుకు సమాచారం ఇవ్వాలన్నారు. బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో యాంటీ డ్రగ్స్, ట్రాఫిక్‌పై అవగాహన, యాంటీ ర్యాగింగ్, సైబర్ నేరాలపై బోధన్ పట్టణ సీఐ వెంకటనారాయణ అవగాహన కల్పించారు. బాధితులు షీ టీం నెంబరు 8712659795, డయల్ 100కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. అనంతరం విద్యార్థినులకు పోలీస్ శాఖ క్యూ ఆర్ కోడ్‌లను అందజేశారు. ఇన్‌చార్జి హెచ్‌ఎం జగదీశ్వర్, ఉపాధ్యాయులు కృష్ణ చైతన్య, రాజేశ్, విద్యార్థులు పాల్గొన్నారు.