మొక్కజొన్న జాతర | - | Sakshi
Sakshi News home page

మొక్కజొన్న జాతర

Jul 15 2025 6:17 AM | Updated on Jul 15 2025 6:17 AM

మొక్క

మొక్కజొన్న జాతర

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: వరి, పసుపు తరువాత జిల్లాలో మొక్కజొన్న సాగు ప్రత్యేకం. పలు ప్రాంతాల్లో తల్లిపంటగా భావించే పసుపులోనూ అంతరపంటగా మొక్కజొన్న సాగు చేస్తున్నారు. పంట చేతికొచ్చే సీజన్‌ కావడంతో మార్కెట్‌లో మక్క కంకుల వ్యాపారం జోరుగా సాగుతోంది. మొక్కజొన్న సాగు, మార్కెట్‌కు పెట్టింది పేరైన అంకాపూర్‌లో ప్రస్తుతం మక్కల జాతర నడుస్తోంది. సీజన్‌ పూర్తయ్యే వరకు ఈ గ్రామంలో మొక్కజొన్నల అమ్మకాలు, కొనుగోళ్లు జోరుగాసాగుతాయి. ఇక్కడ డజన్‌ పచ్చి కంకుల ధర రూ.60 నుంచి రూ.100 పలుకుతోంది. సీజన్‌ మొదట్లో ట్రాలీ ఆటో మక్కల ధర రూ.3వేలు మాత్రమే పలకగా, ప్రస్తుతం రూ.10 వేలకు పెరిగింది. కాల్చిన ఒక్కో కంకిని మాత్రం రూ.20కి విక్రయిస్తున్నారు. ప్రారంభంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా రోహిణి కార్తెలో విత్తుకున్న మొక్కజొన్నల దిగుబడి ఆశించిన స్థా యిలో రాకపోవడంతో అమ్మకాలు మందకొడిగా ప్రారంభమయ్యాయి. ధర పెరిగినప్పటికీ డి మాండ్‌ పెరుగుతుండడం గమనార్హం. దీంతో అంకాపూర్‌ మార్కెట్‌ అమ్మకందారులు, కొనుగోలుదార్లతో కళకళలాడుతోంది. మరిన్నిరోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తుండటంతో మొ క్కజొన్న రైతులు పచ్చి కంకులనే అమ్ముకునేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. వర్షాల కారణంగా మొక్కజొన్న కంకులను ఎండబెట్టడం శ్రమతో కూడుకున్న పని కావడంతో రైతులు పచ్చి కంకులనే అమ్ముకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆర్మూర్‌ పట్టణం నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లే దారిలో 63వ నంబర్‌ జాతీయ రహదారిని ఆనుకొని మార్కెట్‌ ఉండటంతో దూరప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వారు వాహనాలను ఇక్కడ ఆపి మొక్కజొన్న కంకులను కొనుగోలు చేస్తున్నారు. కాగా ఆర్మూర్‌ ప్రాంతంలోని గ్రామాలకు చెందిన రైతులు పండించిన మక్కలను మధ్య దళారులు ముందుగానే కొనుగోలు చేస్తారు. అలాగే రైతులు నేరుగా ఆటో ట్రాలీల్లో పచ్చి మక్కెనలను అంకాపూర్‌ మార్కెట్‌కు తరలించి రోడ్డు పక్కన కుప్పలుగా పోసి అమ్మకాలు సాగిస్తున్నారు. ఎకరం భూమిలో తొమ్మిది నుంచి పది ట్రాలీ ఆటోల్లో నింపే మొ క్కజొన్నలు పండుతాయి. మక్కెన సైజును బట్టి ఒక్కో ఆటో ట్రాలీని రైతుల నుంచి మధ్య దళారులు కొనుగోలు చేస్తున్నారు. అంకాపూర్‌ మార్కెట్‌కు చుట్టుపక్కల జిల్లాలతోపాటు హైదరాబాద్‌, నాగ్‌పూర్‌, నాందేడ్‌, ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి సైతం వచ్చి వ్యాపారులు మక్కకంకులు కొనుక్కుని వెళుతున్నారు.

అంకాపూర్‌ నుంచి మార్కెట్‌కు

తరలివస్తున్న పచ్చి మక్కకంకులు

ట్రాలీ ఆటో నింపుకోవాలంటే రూ.10వేలు

ఏపీ, మహారాష్ట్ర, హైదరాబాద్‌

నుంచి వస్తున్న వ్యాపారులు

డజన్‌ ధర రూ.60 నుంచి రూ.100

కాల్చిన మక్కెన రూ.20..

మొక్కజొన్న జాతర 1
1/1

మొక్కజొన్న జాతర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement