
పండుగ
నేడు ఊరంతా
పోలీసులకు సహకరించాలి
ఖలీల్‌వాడి: ఊర పండుగ శోభాయాత్ర రూట్ ను సీపీ సాయిచైతన్య శనివారం రాత్రి పరిశీలించారు. రఘునాథ ఆలయం, ఖిల్లా చౌరస్తా నుంచి ప్రారంభమై వివేకానంద చౌరస్తా, లక్ష్మి మెడికల్, గాజుల్‌పేట్, పెద్దబజార్, గోల్‌హనుమాన్, పులాంగ్ చౌరస్తా, వినాయక నగర్ ఆర్యనగర్, దుబ్బ తదితర ప్రాంతాల్లో ఏర్పాట్లను పర్యవేక్షించారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. సీపీ వెంట ఎస్బీ సీఐ శ్రీశైలం, నగర సీఐ శ్రీనివాసరాజ్, పెద్దలు రామ్మర్తి గంగారాం, గాండ్ల లింగం, రాజేందర్ ధూంపేట తదితరులున్నారు.
సర్వసమాజ్ ఆధ్వర్యంలో నిర్వహణకు ఏర్పాట్లు
నిజామాబాద్ రూరల్: పిల్లాపాప, పాడి పంట, గొడ్డు గోద సల్లంగా ఉండాలని, ప్లేగు మహమ్మారి నుంచి తమను కాపాడాలని గ్రామ దేవతలను కోలుస్తూ ఇందూరు నగరవాసులు సుమారు 77 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఊరపండగ నేటికీ ఆనవాయితీగా వస్తోంది. ఊరందరికీ ఇదే ‘పెద్ద పండగ’ కావడం విశేషం. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా ఊర పండగను ఘనంగా నిర్వహించేందుకు సర్వసమాజ్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఊర పండగ ఊరేగింపులో నగరవాసులు భారీ సంఖ్యలో పాల్గొని అడుగడుగునా అమ్మవార్ల ఆశీర్వాదం కోసం పూజిస్తారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా బండారు పోసిన తరువాత నగరంలోని నకాశ్‌గల్లీలో మామిడికర్రలతో గ్రామ దేవతల విగ్రహాలను సిద్ధం చేశారు. విగ్రహాల ఊరేగింపులో 54 కుల సంఘాలు పాల్గొననున్నాయి.
భారీ ఊరేగింపు
ఖిల్లా శారదాంబ గద్దె నుంచి ప్రారంభం కానున్న గ్రామదేవతల ఊరేగింపు పెద్దబజార్ చౌరస్తా వద్ద దుబ్బ, వినాయక్‌నగర్, సిర్నాపల్లి గడి దిశగా విడిపోతుంది. గాజుల్‌పేటలోని వివేకానంద చౌరస్తా వద్ద భారీ పోలీసు బందోబస్తు మధ్య సరి (ఇంటిపై చల్లుకునే పదార్థం) కోసం నగరవాసులు పోటీపడుతారు.
12 ప్రాంతాల్లో.. 14 గ్రామ దేవతలు
నగరంలోని మూడు ప్రాంతాల పరిధిలో 12 గుడు లు ఉండగా 14 మంది గ్రామ దేవతలు కొలువుదీరనున్నారు. దుబ్బ ప్రాంతంతో రాట్నం, చక్రం, పెద్దమ్మ, పౌడాలమ్మ, వినాయక్‌నగర్‌లో మహాలక్ష్మి, ఐదు చేతుల పోచమ్మ, మత్తడి పోచమ్మ, సిర్నాపల్లి గడీ రోడ్డులో కొండల రాయుడు, బోగస్వామి, సమ్మక్క, సరక్కలు గద్దెలపై కొలువుదీరుతారు.
కులాలకు అతీతంగా ఏకమై
అమ్మవార్లను కొలవనున్న నగరవాసులు
మామిడి కర్రలతో విగ్రహాలు సిద్ధం
శారదాంబ గద్దె నుంచి ఊరేగింపు
పండుగలో పాల్గొననున్న
కుల సంఘాలు

పండుగ

పండుగ

పండుగ