
కిక్కిరిసిన మేకల సంత
మేకల సంతలో కొనుగోలుదారుల సందడి
నవీపేట: మండల కేంద్రంలో శనివారం మేకల సంత వ్యాపారులు, వినియోగదారులతో కిక్కిరిసింది. నిజామాబాద్‌నగరంతోపాటు గ్రామాల్లో ద ఊరపండగు, వనభోజనాలు నిర్వహిస్తుండడంతో సంత ప్రాంగణం సందడిగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి కొనుగోలదారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. జీవాల ధరలను వ్యా పారులు ఆమాంతం పెంచేశారు. ఒక్కో మేకను రూ. 7 వేల నుంచి రూ. 10 వేలకు విక్రయించారు. అలాగే పొట్టేలును (మేక పోతు) రూ. 12 వేల నుంచి రూ. 15 వేలకు విక్రయించారు. ధరలను లెక్క చేయకుండా వినియోగదారులు పోటాపోటీగా కొనుగోలు చేశారు. ఒక్క రోజే రూ.3 కోట్ల నుంచి రూ. 4 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు వ్యాపారులు పేర్కొన్నారు.
రూ. 3 కోట్లకు పైగా లావాదేవీలు
ఊర పండుగ, వనభోజనాల ప్రభావం