
ఐటీఐతో ఉపాధి అవకాశాలు
నిజామాబాద్‌అర్బన్: ఐటీఐ (పారిశ్రామిక శిక్షణ సంస్థ)లతో విరివిగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందవచ్చని, ఈ సంస్థలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. నగరంలోని ప్రభుత్వ బాలుర ఐటీఐని గురువారం ఆయన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి సందర్శించారు. టర్నర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, స్టెనో తదితర ట్రేడ్ లకు సంబంధించిన వర్క్ షాప్‌లను పరిశీలించారు. శిక్షణ తీరు గురించి, అందుబాటులో ఉన్న యంత్ర పరికరాల గురించి ప్రిన్సిపాల్ యాదగిరిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్కిల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఐటీఐ శిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రభుత్వ తోడ్పాటును విద్యార్థులు, యువత సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వ ఐటీఐలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, సిబ్బంది ఉన్నారు.