
జక్రాన్‌పల్లి గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడిగా లక్ష్మణ
జక్రాన్‌పల్లి: జక్రాన్‌పల్లి గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడిగా లక్ష్మణ్, ఉపాధ్యక్షుడిగా సొస్పరి సుధీర్‌లను సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడి ఆదేశానుసారం జక్రాన్‌పల్లిలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కలిసి అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం తనవంతు కృషి చేస్తానని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రధాన కార్యదర్శి వసంత్‌రావు, అర్గుల్ సొసైటీ చైర్మన్ గంగారెడ్డి, మాజీ సర్పంచ్ నర్సారెడ్డి, నాయకులు సొప్పరి వినోద్, నట్ట తిరుపతి, బొంబాయి రాజు, అనిల్, శ్రీనివాస్, సాయిలు,బుయ్య గంగాధర్, గన్న శ్రీనివాస్, అనిల్, గన్న గంగారాం, పోశెట్టి, శంకర్, అక్బర్, తదితరులు పాల్గొన్నారు.