
విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు
నిజామాబాద్‌నాగారం: రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని జిల్లా వైద్యాధికారిణి రాజశ్రీ పేర్కొన్నారు. నగరంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఉన్న వెల్‌నెస్ కేంద్రాన్ని మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల హాజరు రిజిస్టర్, ఓపీ విభాగం, ల్యాబ్, ఫార్మసీ తదితర విభాగాలను పరిశీలించారు. అనంతరం డీఎంహెచ్‌వో మాట్లాడుతూ మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, అవసరమైన రోగుల వద్ద నుంచి రక్త నమూనాలను తీసి టీహబ్‌కు పంపాలని సూచించారు. ఆమె వెంట వెల్‌నెస్ సెంటర్ వైద్యాధికారిణి డాక్టర్ కృష్ణవేణి, సిబ్బంది ఉన్నారు.
● డీఎంహెచ్‌వో రాజశ్రీ
● వెల్‌నెస్ సెంటర్ తనిఖీ