‘బీఏఎస్‌’ బిల్లులు చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

‘బీఏఎస్‌’ బిల్లులు చెల్లించాలి

Jul 9 2025 6:30 AM | Updated on Jul 9 2025 6:30 AM

‘బీఏఎ

‘బీఏఎస్‌’ బిల్లులు చెల్లించాలి

సీఎంకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు

దినేశ్‌ పటేల్‌ డిమాండ్‌

సుభాష్‌నగర్‌: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌(బీఏఎస్‌) స్కీం పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్‌ పటేల్‌ కులాచారి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి మంగళవారం మెయిల్‌ ద్వారా లేఖ పంపించారు. కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మల్క కొమురయ్యకు విన్నవించారు. ఈ సందర్భంగా దినేశ్‌ పటేల్‌ కులాచారి మాట్లాడుతూ మూడేళ్లుగా ఈ స్కీం బిల్లులు దాదాపు రూ.200 కోట్ల మేర చెల్లించకపోవడంతో యా జమాన్యాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కొ న్ని స్కూళ్లు స్కీం ద్వారా చదువుతున్న విద్యార్థులను రావొద్దని చెప్పడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. తక్షణ మే పెండింగ్‌ బిల్లులు విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్‌ను కాపాడాలని ఆయన కోరారు.

మెరుగైన వైద్య సేవలు

అందించాలి

రుద్రూర్‌/కోటగిరి: ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా మలేరియా వైద్యాధికారి తుకారాం రాథోడ్‌ పేర్కొన్నారు. రుద్రూర్‌, కోటగిరి, పోతంగల్‌ మండల కేంద్రాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. రుద్రూర్‌ ఆస్పత్రిలోని రికార్డులు పరిశీలించారు. మిర్జాపూర్‌ ఆరోగ్య ఉపకేంద్రాన్ని సందర్శించారు. కోటగిరిలో ఇటీవల డెంగీ వచ్చిన వారి ఇంటిని పరిశీలించి, ఆరోగ్య పరి స్థితిని తెలుసుకున్నారు. పోతంగల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సమీక్షించారు. ఆయన వెంట మండల వైద్యాధికారిణి ఆయేషా సిద్ధిఖి, గోవర్ధన్‌, హెల్త్‌ సూపర్‌వైజర్లు రవి, సునీత, వైద్య సిబ్బంది ఉన్నారు.

ఊర పండుగకు అంకురార్పణ

గాజుల్‌పేట్‌లో బండారు పోసిన పెద్దలు

13న ఊర పండుగ

నిజామాబాద్‌ రూరల్‌: నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ఊర పండుగకు అంకురార్పణ జరిగింది. మంగళవారం సర్వసమాజ్‌ కమిటీ, శ్రీ విజయ్‌ మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో నగరంలోని గాజుల్‌పేట్‌ వీధిలో బండారు పోశారు. ఈ సందర్భంగా సర్వసమాజ్‌ కమిటీ కో కన్వీనర్‌ ఆదె ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ ఇందూరు నగరం ఏర్పాటు నుంచి ఊర పండుగ నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సర్వసమాజ్‌ కమిటీ జాయింట్‌ సెక్రటరీలు మల్కాయ్‌ సుదర్శన్‌, పసుల రాజు, కార్యవర్గ సభ్యులు కొత్మీర్‌ సతీశ్‌, శ్రీ విజయ్‌ కిసాన్‌ మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు సుంకటి ప్రవీణ్‌, ప్రధాన కార్యదర్శి పాల్వంచ గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

మృత్యువుతో

పోరాడి ఓడిన బాలిక

చికిత్స పొందుతూ చిన్నారి మృతి

మాక్లూర్‌: వాటర్‌ హీటర్‌ బకెట్లో పడి తీవ్రగాయా లతో ఆస్పత్రుల్లో మూడు నెలలుగా చికిత్స పొందిన బానావత్‌ మనస్వి (4) మంగళవారం రాత్రి మృతి చెందింది. ఎస్సై రాజశేఖర్‌ కథనం ప్రకారం.. మండలంలోని ఎలియానాయ్‌ తండాకు చెందిన బానావత్‌ విజయ్‌కుమార్‌, కిర్తీల కుమార్తె మనస్వి ఏప్రిల్‌ 3న ఆడుకుంటూ పక్కింటికి వెళ్లి అక్కడ వాటర్‌ హిటర్‌ పెట్టి ఉన్న బకెట్లో పడింది. తీవ్రగాయాలు కావడంతో చిన్నారిని నిజామాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని సురక్ష ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా, డాక్టర్‌ సూచన మేరకు ఇటీవలే డిశ్చార్జీ అయ్యింది. మంగళవారం చిన్నారి ఆకస్మికంగా మరణించిందని ఎస్సై తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

‘బీఏఎస్‌’ బిల్లులు చెల్లించాలి 1
1/2

‘బీఏఎస్‌’ బిల్లులు చెల్లించాలి

‘బీఏఎస్‌’ బిల్లులు చెల్లించాలి 2
2/2

‘బీఏఎస్‌’ బిల్లులు చెల్లించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement