
కేటీఆర్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి
వేల్పూర్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 18 నెలలుగా ఏమి చేసిందో కేటీఆర్ గ్రామాలు తిరిగి వాస్తవాలు తెలుసుకొని, మాట్లాడాలని రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో సోమవారం ఆయన ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పరిపాలనలో రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇల్లులేని పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధిని చూడకుండా సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ అవాకులు, చెవాకులు చేస్తే సహించేది లేదన్నారు. మండలాలు, గ్రామాలలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్న వారికి సహకరించాలని సూచించారు. గోదావరి అనే లబ్ధిదారురాలు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని చూసి సంతోషం వ్యక్తం చేశారు.వేల్పూర్ ఏఎంసీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి, డైరెక్టర్ గౌరాయి నరేందర్, నాయకులు దామోదర్‌గౌడ్, మల్లేష్, రమణ, రాజేందర్, రాజేశ్వర్, లావణ్య, లహరి పాల్గొన్నారు.