
లోక కల్యాణార్థమే జగన్నాథ రథయాత్ర
నిజామాబాద్ రూరల్: ఇందూరు నగరంలో లోకకల్యాణం కోసం జగన్నాథ రథయాత్ర కొనసాగిస్తున్న ట్లు ఇస్కాన్ అంతర్జాతీయ బోధకుడు శ్రీమాన్ ప్రణ వానంద దాస్ ప్రభూజీ అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఇస్కాన్ కంఠేశ్వర్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. ర థంపై బలదేవ్, సుభద్రమయి, జగన్నాథుడి విగ్రహాల ను ఏర్పాటు చేసి, ఊరేగింపు నిర్వహించారు. ఈసందర్భంగా శ్రీమాన్ ప్రణవానంద దాస్ ప్రభుజీ మాట్లాడుతూ.. ఇస్కాన్ చేపడుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంతర్జాతీయంగా విజయవంతగా కొనసాగుతున్నాయన్నారు. కార్యక్రమానికి సీపీ సాయి చైతన్య హాజరై స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథయాత్ర ప్రశాంతమైన వాతవరణంలో జరుపుకోవాలని సీపీ పేర్కొన్నారు. రథయాత్రలో భక్తులు శ్రీకృష్ణుని నామస్మరణ చేయగా, నగ రం ఆధ్యాత్మిక శోభ సంతరించరించుకుంది. మహిళలు రోడ్లపై వేసిన వివిధ రకాల రంగవల్లులు ఆకట్టుకున్నాయి. ఇస్కాన్ కంఠేశ్వర్ కేంద్రం అధ్యక్షుడు రామనంద ప్రభురాయ్ దాస్, ఆర్‌ఎస్‌ఎస్ విభాగ్ ప్రచారక్ వెంకట శివకుమార్, అసిస్టెంట్ కమిషనర్ రాజా వెంకటరెడ్డి, మాదాసు స్వామి, అర్బన్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
ఇందూరులో ఇస్కాన్ ఆలయం నిర్మిస్తాం
● ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ
ఇందూరులో ఇస్కాన్ ఆలయం నిర్మిస్తామని, హిందువులు సహకరించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. రథయాత్ర అనంతరం వినాయక్‌నగర్‌లోని విజయలక్ష్మీగార్డెన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి జిల్లా వాసులందరూ సంఘటితం కావాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం 56 రకాల చప్పన్‌భోగ్ నైవేద్యాలను స్వామివార్లకు సమర్పించారు.
ఇస్కాన్ బోధకుడు
శ్రీమాన్ ప్రణవానంద దాస్ ప్రభూజీ
నగరంలో వైభవంగా రథోత్సవం

లోక కల్యాణార్థమే జగన్నాథ రథయాత్ర

లోక కల్యాణార్థమే జగన్నాథ రథయాత్ర

లోక కల్యాణార్థమే జగన్నాథ రథయాత్ర

లోక కల్యాణార్థమే జగన్నాథ రథయాత్ర

లోక కల్యాణార్థమే జగన్నాథ రథయాత్ర