
ఇందూరు జిల్లా క్రీడాకారులకు పుట్టినిల్లు
నిజామాబాద్‌నాగారం: ఇందూరు జిల్లా క్రీడాకారులకు పుట్టినిల్లు అని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జిల్లా క్రీడాకారులు రాణిస్తూ తెలంగాణలో ఆదర్శంగా నిలుస్తున్నారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. తైక్వాండో ఫెడరేషన్ అఫ్ ఇండియా, తెలంగాణ రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఇటీవల 8వ ఓపెన్ నేషనల్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో జిల్లాకు చెందిన 38 మంది క్రీడాకారులు మెడల్స్ సాధించగా గురువారం ఎమ్మెల్యే వారిని మెడల్స్‌తో సత్కరించి అభినందించారు. అలాగే కోచ్ మనోజ్‌ను అభినందించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మొట్టమొదటిసారిగా జాతీయస్థాయిలో 24 గోల్డ్ మెడల్స్, 11 సిల్వర్ మెడల్స్, 3 కాంస్య పతకాలు సాధించడం ఇందూరు జిల్లాకే గర్వకారణమన్నారు. క్రీడలతోపాటు విద్యలో కూడా రాణించాలని, అప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని క్రీడాకారులకు తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించేలా వారికి అండగా ఉంటానని, జిల్లాలో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో క్రీడాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.