
డీవైఎస్‌వోగా పవన్‌కుమార్
నిజామాబాద్‌నాగారం: జిల్లా యువజన క్రీడల అధికారిగా బక్కూరి పవన్‌కుమార్ నియమితులయ్యారు. జిల్లాలో సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న పవన్‌కుమార్‌ను జిల్లా కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు ఇన్‌చార్జి డీవైఎస్‌వోగా నియమించారు. బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. పవన్ ప్రస్తుతం జక్రాన్‌పల్లి ప్రభుత్వ పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఎస్‌జీఎఫ్ సెక్రెటరీగా రెండేళ్లపాటు విధులు నిర్వర్తించిన ఆయన జిల్లాకు రాష్ట్రస్థాయిలో మరింత గుర్తింపు తెచ్చారు. కార్యాలయ ఉద్యోగులు మహిపాల్‌రెడ్డి, దాసు, సురేశ్, మహేశ్, ప్రశాంత్, క్రీడాసంఘాల ప్రతినిధులు పవన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.