పిచ్చికుక్క దాడిలో పలువురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

పిచ్చికుక్క దాడిలో పలువురికి గాయాలు

Jun 28 2025 5:43 AM | Updated on Jun 28 2025 8:50 AM

పిచ్చికుక్క దాడిలో పలువురికి గాయాలు

పిచ్చికుక్క దాడిలో పలువురికి గాయాలు

గాంధారి: పిచ్చికుక్క దాడిలో పలువురు గాయాలపాలైన ఘటన గాంధారి మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఓ చిన్నారి తలకు తీవ్ర గాయాలయ్యాయి. మండల కేంద్రంలోని ఎనిమిదో వార్డులో పిచ్చి కుక్క వీధుల్లో తిరుగుతూ కనబడిన వారందరిపై దాడి చేసి గాయపర్చింది. అమల, అమిక, పాపవ్వ, అనితతో పాటు ఇంటి బయట ఆడుకుంటున్న అమిక అనే చిన్నారిని గాయపర్చింది. పక్కింట్లో ఉండే పాపవ్వ అనే మహిళ కుక్క నుంచి చిన్నారిని విడిపించే ప్రయత్నం చేయగా ఆమైపె కూడా దాడి చేసింది. కుక్కకాటుకు గురైన వారందరిని స్థానికులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా డాక్టర్‌ ప్రసన్న చికిత్స చేశారు. మెరుగైన చికిత్స కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అంతేకాకుండా పిచ్చి కుక్క పశువులు, దూడలపై దాడి చేసి గాయపర్చింది. కాలనీ వాసులు వెంబడించి పిచ్చికుక్కను చంపేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement