రైతులే అంతర్జాతీయ ఎగుమతి చేసుకోవచ్చు
వ్యవసాయ ఉత్పత్తుల్లో దేశంలోనే పేరుగాంచిన ఇందూరు జిల్లాలో డ్రైపోర్టు అత్యవసరం. రైతులే ఎగుమతిదారులుగా తయారవుతారు. దేశంలోనే భా రీ పసుపు మార్కెట్లలో నిజామాబాద్ మొదటి వరుసలో ఉంది. పంట ఉత్పత్తులకు అదనపు విలువ జోడించకుండా వచ్చి న వెంటనే అమ్మేస్తే రైతులకు ఆశించిన ధర ద క్కడం లేదు. ఈ క్రమంలో జక్రాన్‌పల్లి మండలంలో ఐదు గ్రామాల రైతులం కలిసి తెలంగాణలోనే మొదటి పసుపు క్లస్టర్‌ను ఏర్పాటు చేశాం. రైతులు పండించిన పంటతో ఆర్గానిక్ పసుపు పౌడర్‌ను తయారుచేసి విక్రయిస్తున్నాం. డ్రైపో ర్టు ఏర్పాటు చేస్తే రైతులకు మరింత మే లు చేకూరుతుంది. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు యువతకు మరిన్ని అవకాశాలు సృష్టించబడతాయి. గల్ఫ్ దే శాలకు వెళ్లి పనిచేసే అవసరం ఉండదు. ఆత్మనిర్భర్ భారత్ కింద జిల్లాకు డ్రై పోర్టును సాధించుకోవాలి. కేంద్ర ప్రభుత్వ సాయాన్ని కోరుదాం. అందరం పిడికిలి బిగిస్తేనే డ్రైపోర్టు క ల సాకారమవుతుంది. పార్టీలకతీతంగా ముందు కెళదాం. ఎంపీ అర్వింద్, పీసీసీ అధ్యక్షుడు మహే శ్‌గౌడ్‌ను కలుద్దాం. – పాట్కూరి తిరుపతిరెడ్డి,
పసుపు ఎఫ్‌పీవో చైర్మన్


