‘రైతు నేస్తం’ సద్వినియోగం చేసుకోవాలి
● అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్
మోపాల్(నిజామాబాద్‌రూరల్): వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడం, పంటల సా గులో మెళకువలపై అవగాహన కల్పించేందుకు ప్ర భుత్వం తీసుకొచ్చిన ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని అ న్నదాతలు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్ సూచించారు. సోమవారం సాయంత్రం వ్యవసాయ యూనివర్శిటీ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి రైతు వేదికల్లో ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం రైతు భరోసా నిధులను విడుదల చేశారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఆర్డీవో రాజేంద్రకుమార్, మండల ప్రత్యేకాధికారి గోవింద్‌రావు, ఏవో సౌమ్య, సాయిరెడ్డి ఉన్నారు.


