నిరంతరం పారిశుధ్య పనులు
నిజామాబాద్ సిటీ : మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పారిశుధ్య పనులు నిరంతరం కొనసాగుతున్నాయి. పట్టణాలు, నగరాలు రూపురేఖలు మా ర్చేందుకు ప్రభుత్వం వంద రోజుల ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఈకార్యక్రమాన్ని జూన్ 2 నుంచి సెప్టెంబర్ 10 వరకు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ అఽధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రతి అంశాన్ని సమగ్రంగా అమలు చేయాలని, ఇందుకు తగిన కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. దీంతో సెలవు రోజుల్లో సైతం పారిశుధ్య సిబ్బంది పనులు చేస్తున్నారు.
ప్రత్యేక టీంలతో..
వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో పారిశుధ్య పనులు వేగవంతం చేస్తున్నారు. ప్రతిరోజు పనిచేసే సిబ్బందితో పాటు ప్రత్యేక సిబ్బందితో పనులు చేయిస్తున్నారు. అపరిశుభ్రంగా ఉండే కాలనీలు, ఫిర్యాదులు వస్తున్న కాలనీల్లో వెంటనే సిబ్బందితో పనులు నిర్వహిస్తున్నారు. బోర్గాం (పి), వినాయక్‌నగర్, సాయినగర్ కాలనీ, ఫులాంగ్, గాయత్రినగర్, అర్సపల్లి, మాణిక్‌బండార్, ముబారక్‌నగర్ వంటి ప్రాంతాల్లో నిరంతరం శానిటరీ పనులు సాగుతున్నాయి. రెండోశనివారం, ఆదివారం సైతం శానిటరీ సిబ్బంది, జవాన్లు పనులు చేస్తున్నారు. వీరి పనులను క్షేత్రస్థాయిలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, జోన్లలో జరుగుతున్న పనులను శానిటరీ సూపర్ వైజర్లు పర్యవేక్షిస్తున్నారు.
ఆకస్మిక తనిఖీలు..
బల్దియాలో జరుగుతున్న 100 రోజుల ప్రత్యేక పారిశుధ్య పనులను మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్ ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తున్నారు. పలు మార్లు ఆకస్మికంగా తనిఖీలు చేసి, సిబ్బంది హాజరును పరిశీలించారు.
కార్పొరేషన్‌లో కొనసాగుతున్న
100 రోజుల ప్రణాళిక
పనులు చేయిస్తున్న శానిటరీ ఇన్‌స్పెక్టర్లు
క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్న అధికారులు
పట్టణాలు, నగరాల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం 100 రోజుల ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మున్సిపల్ సిబ్బంది స్థానికంగా ఉన్న పలు సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు.
సమస్యలను పరిష్కరిస్తాం
నగరంలో పారిశుధ్య పనులు నిరంతరం జరుగుతున్నాయి. 100 రోజుల ప్రణాళిక కోసం ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేశాం. నగరంలో ఎక్కడైన సమస్యలుంటే వాటిని తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తాం.
– దిలీప్‌కుమార్, కమిషనర్, బల్దియా
నిరంతరం పారిశుధ్య పనులు
నిరంతరం పారిశుధ్య పనులు


