రక్తదానం చేయడం అభినందనీయం
సిరికొండ: రక్తదానం చేయడం ఎంతో అభినందనీయమని హెల్పింగ్ హర్ట్స్ ఫౌండేషన్ చైర్మన్ అయినాల శ్రీకాంత్ పేర్కొన్నారు. మండలంలోని తూంపల్లి గ్రామంలో అంతర్జాతీయ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని రక్తదాతలకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రశంసపత్రాలు అందజేశారు. పలుమార్లు రక్తదానం చేస్తు ప్రాణదాతలుగా నిలుస్తున్న హరీష్‌గౌడ్, బాలరాజ్, రాజు, కిషన్, , రవి, మహేష్, శేఖర్, రాజేశ్వర్, గోపాల్‌లను అభినందించారు. శ్రీకాంత్ మాట్లాడుతు రక్తదానం చేయడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు అన్నారు. వీడీసీ చైర్మన్ లక్ష్మణ్‌గౌడ్, ఫౌండేషన్ వైస్ చైర్మన్ రాజేందర్, రవి, ప్రశాంత్, యశ్వంత్, బాలరాజ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
నిజామాబాద్‌రూరల్ : యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మోపాల్ ఎస్సై యాదగిరిగౌడ్ అన్నారు. శనివారం మండలంలోని కంజర్ గ్రామంలో గంజాయి, మత్తుపదార్థాలపై అవగాహన క
ల్పించారు. గ్రామ అభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలని సూచించారు. వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం
కక్ష సాధింపు చర్య
నిజామాబాద్ రూరల్: మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని జెడ్పీ మాజీ చైర్మన్ దాదాన్న గారి విఠల్ రావు పేర్కొన్నారు. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఏసీబీ కేటీఆర్‌కు నోటీసులు జారీ చేయడంపై ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని హితవు పలికారు.
రక్తదానం చేయడం అభినందనీయం


