ఉచిత శిక్షణకు దరఖాస్తులు
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ (ఆర్‌ఎస్‌ఈటీఐ) ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి ఏసీ రిపేరింగ్ (30 రోజులు), సెల్‌ఫోన్ రిపేరింగ్ (30 రోజులు) శిక్షణ కోర్సులు ప్రారంభిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ రవికుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కో ర్సుల్లో చేరేందుకు పురుషుల నుంచి మాత్ర మే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ కాలంలో నేర్చుకోవడానికి కావాల్సిన టూల్స్, యూనిఫామ్, శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ధ్రువీకరణ పత్రం అందజేస్తామన్నారు. ఉచిత శిక్షణతోపాటు భోజన సదుపాయం, హాస్టల్ వసతి కల్పిస్తామని తెలిపారు. 19 నుంచి 40 సంవత్సరాల వయసు గల నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన గ్రామీణ ప్రాంత యువకులు మాత్రమే అర్హులని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆధార్ , రేషన్ కార్డు, 10వ తరగతి ధ్రువీకరణ పత్రం, ఐదు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు తీసుకొని వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 08461– 295428 నంబర్‌లో సంప్రదించాలని డైరెక్టర్ రవికుమార్ పేర్కొన్నారు.
ఇన్‌చార్జి మంత్రిని కలిసిన
పీసీసీ అధికార ప్రతినిధి
కమ్మర్‌పల్లి: జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా నియమితులైన పంచాయతీ రాజ్, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క)ను టీపీసీసీ అధికార ప్రతినిధి, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పరిశీలకుడు బాస వేణుగోపాల్ యాదవ్ కలిశారు. హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం అందజేశారు. జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కోరినట్లు వేణుగోపాల్‌యాదవ్ తెలిపారు.
సాలూరలో కమ్యూనిటీ కాంటాక్ట్
బోధన్‌రూరల్: సాలూర మండల కేంద్రంలో బోధన్ రూరల్ పోలీసులు శనివారం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని సాయినగర్ కాలనీలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో సమావేశం నిర్వహించి గ్రామస్తులకు శాంతి భద్రతలు, చట్టాలు, పోలీసుల విధులపై అవగాహన కల్పించారు. అనంతరం గ్రామంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. కార్యక్రమంలో సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
రక్తదానం అభినందనీయం
● రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి
నిజామాబాద్ రూరల్: మానవత్వంతో ఆలో చించి రక్తదానం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు ముందుకు రావడం అభినందనీయమని నిజామాబాద్ రూరల్ శాసనసభ్యుడు డాక్టర్ భూపతి రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని కంఠేశ్వర్ బైపాస్‌లో ఉన్న రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంతర్జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజ రైన ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ రక్తదానం చేయడం ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిండు ప్రాణాలను రక్షించడంలాంటిదేనని అ న్నారు. శిబిరం నిర్వహించిన రూరల్ యువ జన కాంగ్రెస్ అధ్యక్షుడు తుంపల్లి మహేందర్, ఉమ్మజి నరేశ్‌లను అభినందించారు. కార్యక్రమంలో రూరల్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఆకాశ్ రెడ్డి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ వినోద్, బైండ్ల ప్రశాంత్, వంశీ, వెంకటేశ్, దివాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఉచిత శిక్షణకు దరఖాస్తులు
ఉచిత శిక్షణకు దరఖాస్తులు


