సామూహిక అక్షరాభాస్యం
డిచ్‌పల్లి: మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించినట్లు ఎంఈవో శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అనంతరం ఎంఈవో పిల్లలతో కలిసి సహపంక్తి (మధ్యాహ్న) భోజనం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందజేస్తారని ఆయన తెలిపారు.
కోటగల్లీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో..
నిజామాబాద్ అర్బన్: బడి బాటలో భాగంగా శుక్రవారం కోటగల్లీ శంకర్ భవన్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. సరస్వతి దేవి చిత్రపటానికి పూలమాలవేసి పూజలు చేశారు. కోటగల్లి కాంప్లెక్స్ హెడ్మాస్టర్ మల్లేశం, సవిత, మమత, సౌందర్య, ముకుంద్, సంతోష్, నందిని, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
నాయీబ్రాహ్మణులకు
సబ్సిడీపై రుణాలు అందించాలి
నిజామాబాద్‌నాగారం: క్షౌ రశాలలను ఆధునీకరించడానికి సబ్సిడీపై రుణాలు ఇవ్వాలని తెలంగాణ నగర నాయీబ్రాహ్మణ దుకాణదారుల యూనియన్ అధ్యక్షుడు దేశాయి గంగాధర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రోజుల్లో కులవృత్తులను నాశనం చేసే విధంగా నాయీ బ్రాహ్మణుల పొట్టగొట్టి ఇతర మతస్తులు మంగళి పనిచేస్తూ మమ్మల్ని రోడ్డుపాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర మతస్తులు హెయిర్ సెలూన్లు పెట్టకుండా మున్సిపల్ అధికారులు అనుమతి ఇవ్వకూడదన్నారు. యాభై ఏళ్లు పైబడిన నాయీ బ్రాహ్మణులకు ఆసరా పెన్షన్ ఇచ్చి, ఇందిరమ్మ ఇళ్లలో కొంత శాతం కేటాయించాలన్నారు.
రోగులకు పండ్లు పంపిణీ
నిజామాబాద్ నాగారం: జాతీయ సర్జన్స్ వారోత్సవాల్లో భాగంగా ది అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా, ఐఎంఏ నిజామాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ప్రభుత్వ ఆస్పత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. రాష్ట్ర సర్జన్స్ సంఘం ప్రెసిడెంట్ డాక్టర్ జీవన్‌రావు, ఏఎస్‌ఐ జిల్లా అధ్యక్షులు టి.నరేంద్ర.. శస్త్ర చికిత్స , వారి పూర్వ అనుభవాలు, ఆధునిక వైద్య విధానం, రోగులకు సేవ చేసే పద్ధతుల గురించి ప్రభుత్వ సర్జికల్ పీజీ వైద్య విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రధాన కార్యదర్శి కేవీ భాస్కర్‌రెడ్డి, కోశాధికారి రాకేష్, డాక్టర్లు రమేశ్, వెంకటరమణారెడ్డి, కౌశిక్, శ్రీలత, పీజీ సర్జన్స్ వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.
సామూహిక అక్షరాభాస్యం


