మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
సిరికొండ: గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు ప్రతి ఒక్కరు దూరంగా ఉండాలని ఎస్సై ఎల్.రామ్ సూచించారు. మండలంలోని చిన్నవాల్గోట్‌లో మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. గ్రామంలో ర్యాలీ చేపట్టారు. ఎస్సై మాట్లాడుతూ.. మత్తు పదార్థాలకు బానిసై జీవితాలను పాడు చేసుకోవద్దన్నా రు. ఎక్కడైనా ఎవరైనా గంజాయి, డ్రగ్స్ లాంటివి అమ్ముతుంటే 1908 నెంబర్‌కు ఫోన్ చేసి సమా చారం ఇవ్వాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని, తగిన పారితోషికం అందిస్తామని తెలిపారు.కాంగ్రెస్ నాయకులు గోవర్ధన్‌రెడ్డి, మహిపా ల్, సాయారెడ్డి,లింబాద్రి,కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
బానిసలు కావొద్దు
ధర్పల్లి: యువత మత్తుకు బానిసలై తమ జీవితాలను బలి చేసుకోవద్దని ఎస్సై రామకృష్ణ సూచించారు. మండల కేంద్రంలో శుక్రవారం కమ్యూనిటీ ఔట్‌రీచ్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాలపై పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మాదకద్రవ్యాలు ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలు, దుష్ప్రభావాలపై ప్రజలకు వివరించారు.
నిజామాబాద్ రూరల్: మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని రూరల్ ఎస్‌హెచ్‌వో మహమ్మద్ ఆరిఫ్ తెలిపారు. శుక్రవారం నగరంలోని ఒకటో డివిజన్ ఖానాపూర్లో గంజాయి, మత్తు పదార్థాల నివారణ, రోడ్డు భద్రత గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ ఎస్‌హెచ్‌వో మాట్లాడుతూ.. ప్రయాణికులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు.


