ఫ్రస్ట్రేషన్‌లో కేసీఆర్ ఫ్యామిలీ
నిజామాబాద్ సిటీ: కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై కేసీఆర్, హరీశ్‌రావును విచారిస్తుంటే భరించలేక సీ ఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించారని, ఇప్పుడు విచారిస్తుంటే కేసీఆర్ ఫ్యామిలీ ఫ్రస్ట్రేట్ అవుతోందన్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న రేవంత్‌పై అభ్యంతకరవ్యాఖ్యలు చేస్తున్న కేటీఆర్‌ను బయటతిరనివ్వమన్నారు. కేసీఆర్ కుటుంబంలో ఇంటిపోరు నడుస్తోందని, ఒకవైపు బిడ్డ, మరోవైపు కొడుకు ఆధిపత్యం కోసం కొట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ బిడ్డ లిక్కర్ కేసులో, కొడుకు ఫార్ముల వన్ కేసులో, హరీశ్‌రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుకున్నారని, వారిని బీజేపీ కాపాడుతోందని ఆరోపించారు. కేటీఆర్ తన వ్యాఖ్యలను మానుకోకుంటే భౌతిక దాడులకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు అన్యా యం జరిగిందని, ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామన్నారు. మలివిడత విస్తరణలో జిల్లా కు అవకాశం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశా రు. సమావేశంలో మార్కెట్‌యార్డు చైర్మన్ ముప్పగంగారెడ్డి, నాయకులు మునిపల్లి సాయిరెడ్డి, వేణురాజ్, సంతోష్, బోర్గాం శ్రీనివాస్, ప్రవీణ్‌కుమార్, జువ్వాజి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
కాళేశ్వరం అక్రమాలపై విచారణను భరించలేకపోతున్నారు
సీఎం రేవంత్‌పై కేటీఆర్ వ్యాఖ్యలు
అభ్యంతరకరం
ఆయనను బయట తిరగనివ్వం
మంత్రి పదవి కేటాయింపులో
జిల్లాకు అన్యాయం జరిగింది
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే
ఆర్ భూపతిరెడ్డి


