పదవులు దక్కని సీనియర్లెవరు?
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : అధికార కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల కోసం జిల్లాకు చెందిన పలువురు సీనియర్లు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు డీసీసీ అధ్యక్ష పీఠం కోసం, బ్లాక్, మండల అధ్యక్ష పదవుల కోసం పలువురు నాయకులు పోటీ పడుతున్నారు. అయితే కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు సైతం పలువురు ఆశావహులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. రిజర్వేషన్లు ఎలా వస్తాయనే విషయమై లెక్కలేసుకుంటూ ఎదురు చూస్తున్నారు. అయితే జిల్లా అధ్యక్ష పీఠం కోసం, మండల అధ్యక్ష పదవుల కోసం దరఖాస్తులు చేసుకునేవారు ఎక్కువగా ఉన్నారు. దీంతో పార్టీ కోసం కష్టపడినవారికి ఎక్కువ అవకాశాలు కల్పించేందుకు గాను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ కసరత్తు చేస్తున్నారు. మీనాక్షి నటరాజన్ క్షేత్రస్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని పకడ్బందీగా చేసే లక్ష్యంతో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే పార్టీ పదవులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలోకి దించేందుకు అవకాశాలు కల్పించేందుకు ఆమె కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది.
పూర్తి వివరాలు తెప్పించుకుంటున్న మీనాక్షి నటరాజన్
పార్టీ పదవులతో పాటు
స్థానిక సంస్థల పదవుల్లో
ప్రాధాన్యత ఇచ్చేందుకు ప్రణాళిక
ఎమ్మెల్యేలు, కీలక నాయకులతో
విడివిడిగా చర్చించిన రాష్ట్ర కాంగ్రెస్
వ్యవహారాల ఇన్‌చార్జి
ఆశావహుల్లో ఉత్కంఠ


