
ట్యూమర్‌కు భయపడొద్దు..
బ్రెయిన్‌ట్యూమర్ అనగానే భయపడొద్దు. గతంలో ట్యూమర్ వస్తే చనిపోతారనే భయం ఉండేది. ప్రస్తుతం వైద్యం అందుబాటులో ఉంది. ట్యూమర్‌లో చాలా రకాల క్యాన్సర్‌లు ఉంటాయి. ప్రతి ట్యూమర్ క్యాన్సర్ కాదు. 50శాతం క్యాన్సర్ ఉండదు. ఆపరేషన్‌తో నయం అవుతుంది. చాలా ట్యూమర్‌లు జన్యుపరమైనవి కావచ్చు. ఏదీ ఏమైనా ఎమ్‌ఆర్‌ఐ చేస్తే తెలిసిపోతుంది. తద్వారా చికిత్సతో నయమవుతుంది.
– నరసింహ కట్ట, న్యూరోసర్జన్, మనోరమ ఆస్పత్రి
మంచి చికిత్స ఉంది
ఒక వ్యాధిగా కాకుండా, రోగికి కొత్త జీవితాన్ని ప్రసాదించే అవకాశంగా చూస్తాం. అధునాతన, న్యూరో–నావిగేషన్ సిస్టమ్స్, మినిమల్ ఇన్వాసివ్ సర్జరీ, రోబోటిక్ సర్జరీ వంటి అత్యాధునిక పద్ధతులను ఉపయోగించి, రోగులకు సురక్షితమైన, వేగవంతమైన కోలుకునే చికిత్సను అందిస్తున్నాం.ఒక చిన్న స్కాన్, ఒక సరైన వైద్య నిర్ణయం ఒకరి జీవితాన్ని, ఒక కుటుంబ భవిష్యత్తును పూర్తిగా మారుస్తుంది.
– శ్రీకృష్ణ ఆదిత్య, న్యూరోసర్జన్, మెడికవర్ ఆస్పత్రి

ట్యూమర్‌కు భయపడొద్దు..