బంగారు దుకాణాల్లో భారీ చోరీ
● 16 కిలోల వెండి,
34 తులాల బంగారం..
● రూ.లక్ష నగదు అపహరణ
● బోధన్ పట్టణంలో ఘటన
బోధన్: పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి ఎదురుగా ఉన్న రెండు బంగారు దుకాణాల్లో దుండగు లు భారీ చోరీకి పాల్పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి.. శనివారం అర్ధరాత్రి వేళ సీసీ కెమెరాలను పక్కకు మళ్లించి రెండు దుకాణాల షట్టర్ల తాళాలు పగులగొట్టారు. ప్రగతి బంగారు, వెండి దుకాణంలోకి ప్రవేశించిన దుండగులు నాలుగు తులాల బంగారం, 6 కిలోల వెండి, రూ.20 వేల నగదు, శివ బంగారు దుకాణంలో నుంచి 30 తు లాల బంగారం, 10 కిలోల వెండి, రూ.80 వేల నగదు దోచుకెళ్లారు. దుకాణాల యజమానులు ఆదివారం ఉద యం పోలీసులకు సమాచారం అందించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీములతో పోలీసులు విచారణ చేపట్టారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయ్‌బాబు బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ముఖాలకు మాస్కులు, చేతులకు గ్లౌజ్‌లు ధరించిన నలుగురు దుండగుల కదలికలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. బాధితుల ఫి ర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


