గాంధీ పేరును రూపుమాపే కుట్ర
నిజామాబాద్ రూరల్: ఉపాధిహామీ పథకం నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగింపును కాంగ్రెస్ శ్రేణులు ఖండించాయి. ఏఐసీసీ పిలు పు మేరకు ఆ పార్టీ శ్రేణులు ఆదివారం జిల్లా కేంద్రంలో నిరసన తెలిపాయి. కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌రెడ్డి, నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో గాంధీచౌక్ వద్ద గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడే నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నగేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. గాంధీజీ దేశానికి అందించిన సేవలను ప్రజలు ఎన్నటికీ మరువరని, 2029లో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగా నే ఉపాధి పథకానికి మహాత్ముని పేరును మళ్లీ పెడతామన్నారు. గాంధీ పేరును దేశంలో రూ పుమాపేందుకు బీజేపీ ఎన్నో కుట్రలు చేస్తోందని, అందులో భాగంగానే ఉపాధి హామీ పథకం పేరు మార్పు అని మండిపడ్డారు. ఇప్పటికే రా జ్యాంగాన్ని మార్చాలని బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఉర్దూ అకాడమీ చైర్మర్ తాహెర్ బిన్ హందాన్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించేందుకు మన్‌మోహన్‌సింగ్ తీసుకువచ్చిన ఉపాధిహామీ పథకం ద్వారా ఎంతో మందికి పని లభించిందన్నారు. ఉపాధి హామీ పథకం లాగానే మహాత్మాగాంధీ ఫొటో ఉన్న కరెన్సీ నోట్లను రద్దు చేసి చూపించాలని అన్నారు. రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, నూడా చైర్మన్ కేశ వేణు, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్‌గౌడ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, ప్రచార కమిటీ మెంబర్ జావిద్ అక్రమ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్‌గౌడ్, నాయకులు గోపి, వేణురాజ్, యాదగిరి, లింగం, శ్రీనివాస్, నర్సారెడ్డి, ము త్యంరెడ్డి, బలరాజ్, రాములు, భూమేశ్, రేవతి, మోయిన్, ఎజాజ్, పూల ఉష, చంద్రకళ, విజయలక్ష్మి, ప్రీతం, రాజేంద్రప్రసా ద్, అష్రఫ్, మలైకా, శుభం, మహేందర్, రమేశ్, రాజ్‌గగన్, బాలనర్సయ్య, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధిహామీ పథకం నుంచి
పేరు తొలగింపు తగదు
ఆయన దేశానికి అందించిన
సేవలను ప్రజలు మరువరు
2029లో అధికారంలోకి రాగానే ‘ఉపాధి’ పథకానికి మహాత్ముని పేరు
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌రెడ్డి
జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణుల
నిరసన.. గాంధీజీ విగ్రహానికి
పాలాభిషేకం


