లోక్ అదాలత్‌లో 63,790 కేసుల పరిష్కారం
నిజామాబాద్ లీగల్: జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌లో 63,790 కే సులు పరిష్కారమయ్యాయి. 38 మోటార్ వెహికిల్ పిటిషన్లను పరిష్కరించి రోడ్డు ప్రమాద బాధితుల కు రూ.3 కోట్ల 60 వేల పరిహారాన్ని అందించారు. 42 సివిల్ కేసులు, 8,579 క్రిమినల్ కేసులు, 55,169 ప్రీలిటిగేషన్ కేసులను పరిష్కరించారు. కేసుల పరిష్కారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆరో స్థానంలో నిలిచింది. కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ చక్కని మార్గమని జిల్లా ఇన్ చార్జి జడ్జి డి. దుర్గాప్రసాద్ అన్నారు. అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. లోక్ అదాలత్‌తో ఇరుపక్షాలకు సరై న న్యాయం లభిస్తుందన్నారు. బార్ అధ్యక్షుడు సా యిరెడ్డి, జిల్లా న్యాయసేవ సంస్థ కార్యదర్శి సాయిసుధా, డీసీపీ బస్వారెడ్డి, జూనియర్ సివిల్ జడ్జి గోపీకృష్ణ, మేజిస్ట్రేట్‌లు కుష్బు ఉపాధ్యాయ, శ్రీనివాస్‌రావు, హరికుమార్, చైతన్య, కీర్తిరాజ్, బార్ కార్యదర్శి మాణిక్ రాజు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా లోక్ అదాలత్‌లో ట్రాఫిక్ చలాన్లపై పోలీసులు 50 శాతం రాయితీ ఇవ్వకపోవడంతో వాహనదారులు నిరాశతో వెనుదిరిగారు.


